తెలుగు న్యూస్ / ఫోటో /
PCOS: పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది
- PCOS: మహిళల్లో పీసీఓఎస్ సమస్య అధికంగా వస్తుంది. దీని వల్ల సరిగా నిద్రపట్టదు. బరువు కూడా తీవ్రంగా పెరుగుతారు. నిద్రను మెరుగుపరుచుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు.
- PCOS: మహిళల్లో పీసీఓఎస్ సమస్య అధికంగా వస్తుంది. దీని వల్ల సరిగా నిద్రపట్టదు. బరువు కూడా తీవ్రంగా పెరుగుతారు. నిద్రను మెరుగుపరుచుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు.
(1 / 6)
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, లేదా పిసిఒఎస్ సమస్యలో అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి చిన్న తిత్తులుగా మారుతాయి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. పిసిఒఎస్ వల్ల రుతుక్రమం సక్రమంగా రాదు, జుట్టు అధికంగా పెరుగుతుంది. మొటిమలు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. పిసిఒడి వల్ల నిద్ర సరిగా పట్టదు. నిద్రా సమస్యలు వస్తాయి. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది.(Shutterstock)
(2 / 6)
రాత్రిపూట నిద్రకు ముందు టీవీలు, ఫోన్లు చూడడం ఆపేయాలి. స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతి శరీరంలోని నిద్రా చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. (Unsplash)
(3 / 6)
శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ సవ్యంగా ఉంటేనే నిద్ర చక్కగా పడుతుంది. శరీరాన్ని ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతికి గురయ్యేలా చేయాలి. ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను సహజంగా తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల నిద్ర చక్కగా పడుతుంది.(Unsplash)
(4 / 6)
సూర్యాస్తమయాంలోని సూర్యుడి కిరణాలు మీ శరీరానికి తాకేలా చూడండి. ఇవి శరీరం మెలటోనిన్ ఉత్పత్తి చేయడానికి, శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. దీనివల్ల నిద్ర పడుతుంది.(Unsplash)
(5 / 6)
నిద్రవేళలు ప్రతిరోజూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ప్రాణాయామం చేయడం ద్వారా నిద్ర చక్కగా పట్టేలా చేయవచ్చు.(Unsplash)
ఇతర గ్యాలరీలు