తెలుగు న్యూస్ / ఫోటో /
SBI Recruitment : ఎస్బీఐలో 10 వేల ఉద్యోగాలు.. అప్పటిలోగా రిక్రూట్‌మెంట్.. ఏయే పోస్టులంటే?
- SBI Recruitment : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇందులో 10,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అంటే 2025 మార్చి 31 నాటికి 10,000 పోస్టులను భర్తీ చేయాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
- SBI Recruitment : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇందులో 10,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అంటే 2025 మార్చి 31 నాటికి 10,000 పోస్టులను భర్తీ చేయాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
(1 / 5)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని ఎస్బీఐ యోచిస్తోంది. సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలతో పాటు వివిధ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తగినంత మంది ఉద్యోగులు అవసరమని ఎస్బీఐ తెలిపింది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 వేల ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
(2 / 5)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. టెక్నికల్ రంగంతో పాటు జనరల్ బ్యాంకింగ్ రంగంలోనూ ఉద్యోగులను నియమించుకోనున్నట్టుగా తెలిపారు. టెక్నికల్ విభాగంలో ఎంట్రీ లెవల్(జూనియర్ పోస్టు), కొన్ని ఉన్నత స్థాయి(కొన్ని సీనియర్ పోస్టులు)లో 1,500 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
(3 / 5)
టెక్నికల్ ఫీల్డ్ లో రిక్రూట్ చేసుకోబోయే వారిలో కొందరిని అత్యంత స్పెషలైజ్డ్ పోస్టులకు నియమిస్తామని ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. ఈ జాబితాలో డేటా సైంటిస్ట్, డేటా ఆర్కిటెక్ట్, నెట్వర్క్ ఆపరేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. టెక్నాలజీ రంగంలో వివిధ రకాల పోస్టుల్లో వారిని నియమించనున్నారు.
(4 / 5)
2024 మార్చి నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,32,996. వీరిలో 1,10,116 మంది 'ఆన్ రోల్స్'లో ఉన్నారు. కస్టమర్ల డిమాండ్ మారుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ తెలిపారు. వారి అంచనాలు మారుతున్నాయి. టెక్నాలజీ మారుతోంది. అందువల్ల అన్ని స్థాయిల్లో ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
(5 / 5)
కొత్త ఉద్యోగుల నియామకంతో దేశంలో శాఖల సంఖ్యను పెంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో మరో 600 శాఖలను ప్రారంభించాలని అనుకుంటోంది. మార్చి 2024 నాటికి దేశంలో ఎస్బీఐకి 22,542 శాఖలు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ తాము 500 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇతర గ్యాలరీలు