Telangana SSC Exams : ఇక 'సైన్స్' పరీక్ష 2 రోజులు...! టెన్త్ ఎగ్జామ్స్ పై తాజా అప్డేట్ ఇదే-ssc science exam is likely to be conducted over two days in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Ssc Exams : ఇక 'సైన్స్' పరీక్ష 2 రోజులు...! టెన్త్ ఎగ్జామ్స్ పై తాజా అప్డేట్ ఇదే

Telangana SSC Exams : ఇక 'సైన్స్' పరీక్ష 2 రోజులు...! టెన్త్ ఎగ్జామ్స్ పై తాజా అప్డేట్ ఇదే

Dec 26, 2023, 04:45 PM IST Maheshwaram Mahendra Chary
Dec 26, 2023, 04:45 PM , IST

  • Telangana SSC Exams 2024:  తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే సైన్స్ పరీక్ష విషయంలో పలు మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయంపై విద్యాశాఖ… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ కూడా ఇచ్చింది.  

(1 / 5)

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ కూడా ఇచ్చింది.  (TS SSC Board)

ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు నిర్వహిస్తుండగా.. 6 పేపర్లకు కుదించినట్లు కూడా విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే సైన్స్ ఎగ్జామ్ విషయంలో పలు మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

(2 / 5)

ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు నిర్వహిస్తుండగా.. 6 పేపర్లకు కుదించినట్లు కూడా విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే సైన్స్ ఎగ్జామ్ విషయంలో పలు మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.(unsplash.com)

పదోతరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్‌ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ రెండు పేపర్లు ఉండటంవల్ల పరీక్ష రెండు రోజులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారని సమాచారం. 

(3 / 5)

పదోతరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్‌ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ రెండు పేపర్లు ఉండటంవల్ల పరీక్ష రెండు రోజులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారని సమాచారం. (unsplash.com)

ఒకే రోజు రెండు పేపర్లు ఉండటంతో… విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఒత్తిడికి గురైతున్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే…అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.

(4 / 5)

ఒకే రోజు రెండు పేపర్లు ఉండటంతో… విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఒత్తిడికి గురైతున్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే…అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.(unsplash.com)

విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే… ఈసారి సైన్స్ ఎగ్జామ్ ను రెండు రోజులు(భౌతిక, జీవ శాస్త్రం) నిర్వహించే అవకాశం ఉంటుంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావొచ్చు.

(5 / 5)

విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే… ఈసారి సైన్స్ ఎగ్జామ్ ను రెండు రోజులు(భౌతిక, జీవ శాస్త్రం) నిర్వహించే అవకాశం ఉంటుంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావొచ్చు.(unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు