తెలుగు న్యూస్ / ఫోటో /
Vande Bharat sleeper coach Pics: వందే భారత్ స్లీపర్ కోచ్ ఫోటోలు చూశారా.. 3 నెలల్లో ప్రయాణం ప్రారంభించొచ్చు
- Vande Bharat sleeper coach Pics: వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ వెర్షన్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూరులోని బీఈఎంఎల్ ఫెసిలిటీలో ఆవిష్కరించారు. ఈ స్లీపర్ కోచ్ సరికొత్త ప్రయాణ అనుభూతిని మిగిల్చనుందని ఈ ఫోటోలు చెబుతున్నాయి.
- Vande Bharat sleeper coach Pics: వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ వెర్షన్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూరులోని బీఈఎంఎల్ ఫెసిలిటీలో ఆవిష్కరించారు. ఈ స్లీపర్ కోచ్ సరికొత్త ప్రయాణ అనుభూతిని మిగిల్చనుందని ఈ ఫోటోలు చెబుతున్నాయి.
(1 / 7)
వందే భారత్ స్లీపర్ కోచ్ మోడల్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఫెసిలిటీలో ఆవిష్కరించారు. స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ పరీక్షించిన తర్వాత, భారీ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్రోటోటైప్‌లను ఈ నెలలో పంపుతామని, డిసెంబర్ లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.(source: DD News)
(2 / 7)
వందే భారత్ స్లీపర్ రైలులో 16 బోగీలు ఉంటాయి, ఇవి 800 కిలోమీటర్ల నుండి 1,200 కిలోమీటర్ల వరకు రాత్రిపూట ప్రయాణాలు చేయడానికి వీలుగా రూపొందిస్తున్నారు. మెరుగైన ఆక్సిజన్ స్థాయి ఉండేలా, వైరస్‌ల నుంచి రక్షణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.(via HT)
(3 / 7)
స్లీపర్ కోచ్ లోకో పైలట్ ఉండే ప్రదేశం ఇది. వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నామని, కొత్త రైలు రూపకల్పన సంక్లిష్టంగా ఉంటుందని వైష్ణవ్ పేర్కొన్నారు.(via HT)
(4 / 7)
స్లీపర్ కోచ్‌కు 10 రోజుల్లో కఠినమైన ట్రయల్స్, పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే మూడు నెలల్లో ఈ రైలు ప్రయాణికుల రాకపోకలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.(via HT)
(5 / 7)
వందే భారత్‌లో చైర్ కార్లు, స్లీపర్ కార్లు, మెట్రో కార్లు, అమృత్ భారత్ అనే నాలుగు రకాల రైళ్ల ద్వారా రైలు ప్రయాణ అనుభూతి మొత్తం మారేలా రైల్వే శాఖ పనిచేస్తోందని మంత్రి వైష్ణవ్ తెలిపారు.(via HT)
(6 / 7)
బీఈఎంఎల్ కేంద్రాన్ని సందర్శించిన వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ కోచ్ ను పరిశీలించి రైల్వే సిబ్బందితో మాట్లాడారు.(source: DD News)
ఇతర గ్యాలరీలు