సారాతో సచిన్ పైలట్ విడాకులు.. రెండు దశాబ్దాల వైవాహిక బంధానికి ముగింపు-sachin pilot divorced from sara abdullah poll affidavit confirms ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సారాతో సచిన్ పైలట్ విడాకులు.. రెండు దశాబ్దాల వైవాహిక బంధానికి ముగింపు

సారాతో సచిన్ పైలట్ విడాకులు.. రెండు దశాబ్దాల వైవాహిక బంధానికి ముగింపు

Nov 01, 2023, 12:57 PM IST HT Telugu Desk
Nov 01, 2023, 12:57 PM , IST

  • సారా అబ్దుల్లా 2004లో సచిన్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌కు చెందిన రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్‌తో సారా స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు చేరింది.

సచిన్ పైలట్ కాంగ్రెస్ యువ నాయకులలో ఒకరిగా పేరు పొందారు. అతను తన వైవాహిక జీవితంలో రెండు దశాబ్దాలు సారా అబ్దుల్లాతో గడిపాడు. ఈసారి ఎన్నికల అఫిడవిట్‌లో ఆ బంధం విడిపోయినట్టు పేర్కొన్నారు. సారా అబ్దుల్లా కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. 

(1 / 5)

సచిన్, సారా అబ్దుల్లా స్నేహితులు, ఆ బంధం ప్రేమగా మారి 2004లో వివాహం చేసుకున్నారు. సచిన్‌ పైలట్ రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలట్ కుమారుడు. సారా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. వీరి వైవాహిక జీవితం పలు ఒడిదుడుకులు ఎదుర్కొంది. సచిన్ రాజకీయ జీవితం అదే విధంగా కొనసాగుతోంది. 

(2 / 5)

సచిన్, సారా అబ్దుల్లా స్నేహితులు, ఆ బంధం ప్రేమగా మారి 2004లో వివాహం చేసుకున్నారు. సచిన్‌ పైలట్ రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలట్ కుమారుడు. సారా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. వీరి వైవాహిక జీవితం పలు ఒడిదుడుకులు ఎదుర్కొంది. సచిన్ రాజకీయ జీవితం అదే విధంగా కొనసాగుతోంది. (PTI)

సచిన్, సారా దంపతులకు అరన్, బెహన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజస్థాన్ రాజకీయాల్లో సచిన్ కాంగ్రెస్ రెబల్ లీడర్‌గా పేరు తెచ్చుకోవడం గమనార్హం. పలు రాజకీయ సంచలన మలుపుల్లో ఆయన పేరు పదే పదే తెరపైకి వచ్చింది. 46 ఏళ్ల నాయకుడు ఈ ఏడాది రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఆ ఎన్నికల నామినేషన్ దాఖలులో సచిన్ తన విడాకుల గురించి ప్రస్తావించాడు.

(3 / 5)

సచిన్, సారా దంపతులకు అరన్, బెహన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజస్థాన్ రాజకీయాల్లో సచిన్ కాంగ్రెస్ రెబల్ లీడర్‌గా పేరు తెచ్చుకోవడం గమనార్హం. పలు రాజకీయ సంచలన మలుపుల్లో ఆయన పేరు పదే పదే తెరపైకి వచ్చింది. 46 ఏళ్ల నాయకుడు ఈ ఏడాది రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఆ ఎన్నికల నామినేషన్ దాఖలులో సచిన్ తన విడాకుల గురించి ప్రస్తావించాడు.(PTI)

తన ఇద్దరు పిల్లలు తనపైనే ఆధారపడి ఉన్నారని సచిన్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2018లో తన ఆస్తులు రూ.3.8 కోట్లు అని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2023లో అతని మొత్తం ఆస్తి మొత్తం 7.5 కోట్లు. 

(4 / 5)

అమెరికాలోని పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్శిటీలో సచిన్ చదువుతున్నప్పుడు సారాతో పరిచయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తె, ఒమర్ అబ్దుల్లా సోదరి సారా కూడా అమెరికాలోనే ఉన్నారు. సచిన్ చదువు పూర్తయ్యాక ఇండియాకు రాగా, సారా అమెరికాలోనే ఉంటోంది. అయితే ఆ తర్వాత పెళ్లి దాకా వెళ్లింది. వివాహ బంధం ఇటీవలే ముగిసింది. అయితే, ఈ సంబంధం ముగియడం వెనుక ఏమి జరిగిందనే విషయం ఇంకా బయటకు పొక్కలేదు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు