Vastu Tips for Newly married: కొత్తగా పెళ్లయిన వారు ఇలా చేశారంటే.. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు!
Vastu Tips for Newly married:తమ వైవాహిక జీవితాన్ని ప్రేమ, ఆనందం, శ్రేయస్సుతో నింపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం సుఖంగా ఉండేందుకు నూతన వధూవరులు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి.
కొత్తగా పెళ్లయిందా..? జీవితాన్ని కొత్త వ్యక్తితో సరికొత్త గృహంలో ప్రారంభిస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. వైవాహిక జీవితం సంతోషంగా, సామరస్యంగా ఉండేందుకు వాస్తు శాస్త్రం మీకు కచ్చితంగా సహాయపడుతుంది. మీరు ఎన్నో ఏళ్లేగా కలల ప్రపంచం ప్రేమ, ఆనందం,శ్రేయస్సు సృజనాత్మకతతో నిండి ఉండాలంటే మీరు కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది. మీ నూతన గృహంలో మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మీ భాగస్వామికి మీకూ మధ్య ప్రేమ, సానుకూలత, ఐక్యతను పెంచి బంధాన్ని బలపరుస్తాయి. వైవాహిక జీవితాన్ని స్వర్గంగా మార్చేందుకు మీకు ఉపయెగపడే వాస్తు చిట్కాలేంటో తెలుసుకుందాం.
* మెయిన్ డోర్:
మీ ఇంటికి ఎవరొచ్చినా మొదటిసారి కనిపించేది ఇంటి గుమ్మం. కాబట్టి మెయిన్ డోర్ అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూసుకొండి. ఇంటి గుమ్మానికి సంబంధించి వాస్తు సరిగ్గా ఉండటం ఇంట్లోని వ్యక్తుల మధ్య ప్రేమ, సానుకూల వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. వాస్తు ప్రకారం ఈ దిశ అత్యంత శుభప్రదమైనది. ఎందుకంటే ఈ దిశ సానూకూల శక్తిని, అవకాశాలను ఆకర్షిస్తుంది.
* చెప్పుల స్టాండ్:
ఈ మధ్య చాలా మంది మెయిడ్ డోర్ పక్కనే చెప్పుల స్టాండ్, చెత్త డబ్బా పెట్టుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఈ చాలా ప్రమాదకరం. ఇంటికి ప్రధాన ద్వారమైన మెయిన్ డోర్ దగ్గర చెప్పుల స్టాండ్ గానీ, చెత్త డబ్బా గానీ ఉండటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు సులభంగా ప్రవేశించగలుగుతాయి. ఇవి భార్యభర్తల మధ్య గొడవలు, చికాకులను దారితీస్తాయి. ఆర్థికంగా కూడా మిమ్మల్ని బలహీనపరుస్తాయి.
*బెడ్ రూం:
మీ కొత్త జీవితం ప్రేమ, ఆనందంతో నిండిపోవాలంటే మీ బెడ్ రూం వాస్తు చాలా ముఖ్యం. భార్యభర్తలు ఇద్దరూ సంతోషంగా గడిపినా, గొడవలు పడ్డా వాటికి బీజం ఇక్కడే పడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బెడ్ రూం వాస్తు సరిగ్గా లేకపోతే నిద్రలేమి సమస్య వస్తుంది. ఇది భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తుంది. కనుక పడక గది నైరుతి దిశలో ఉండేలా చూసుకోండి. అలాగే బెడ్ రూంలో అద్దాలను ఉంచడం మానుకొండి. వాస్తు శాస్త్రం ప్రకారం.. అద్దం అశాంతికి, ప్రతికూల శక్తులకు నిలయం.
*లివింగ్ రూం:
నూతన వధూవరుల సానుకూల చర్చలు, సరదా సమయానికి ప్రత్యేకమైన చోటు లివింగ్ రూం. వాస్తు ప్రకారం ఇది తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిశల్లో కూర్చోవడం వల్ల ఇంట్లో సంభాషణలన్నీ సానుకూలంగా ఉంటాయి. బంధం మరింత బలపడుతుంది.
* రంగులు:
ఇంటిని అందంగా నిర్మించుకోవడం ఎంత ముఖ్యంగా ఆకర్షణీయంగా అలంకరించుకోవడం అంత కన్నా ముఖ్యం. ముఖ్యంగా ఇంటికి వేసుకునే రంగులు ఇంటి అందాన్ని, అదృష్టాన్ని మార్చగల శక్తి కలిగి ఉంటాయి. ఇంట్లోని గోడలు, ఫర్నీచర్ ఎప్పుడూ మృదువైనవి, లేత రంగుల్లో ఉండేలా చూసుకొండి. ఇవి భావోద్వేగాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
*వంటగది:
ఇంట్లో అన్నింటికన్నా ముఖ్యమైనది వంటగది. ఇది అగ్నిమూలకం. కనుక వంటగది ఎప్పుడూ ఆగ్నేయ మూలలో ఉండాలి.తప్పని పరిస్థితిల్లో వాయువ్య మూలలో కూడా ఉంచవచ్చు. వంట చేసే వ్యక్తి తూర్పు ముఖంగా ఉండటం వల్ల ఇది సానుకూలతను పెంచి బంధాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వంటగది ఎప్పుడూ తలుపుకు ఎదురుగా లేదా బాత్‌రూంకు పక్కన ఉండకుండా చూసుకోండి. ఇది శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది.
* డైనింగ్ ఏరియా:
భార్యభర్తల మధ్య సంభాషణ, సాన్నిహిత్యాన్ని ప్రోత్సహించే చోటు డైనింగ్ టేబుల్. అలాంటి డైనింగ్ టేబుల్ పశ్చిమం, తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. అలాగే డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడూ తాజా పండ్లు, పువ్వులు ఉండేలా చూసుకొండి.
* అలంకరణ:
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు నూతన వధూవరుల ఇంట్లో అలంకరణ విషయంలో ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఇంట్లో శ్రేయస్సును పెంచేందుకు మనీ ప్లాంట్, వెదురు, తులసి వంటి ఇండోర్ మోక్కలతో పాటు జంట పక్షుల, రొమాంటిక్ ల్యాండ్ స్కేప్ వంటి ఫొటోలతో ఇంటిని అలంకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రేమ, ఐక్యత పెరుగుతాయి. అలాగే ఆగ్నేయ లేదా ఈశాన్య మూలల్లో దీపాలు ఉంచాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.