Indians Health: ప్రతి 20 సెకన్లకు ఒక భారతీయుడు ఈ వ్యాధి బారినపడుతున్నారట, జాగ్రత్తగా ఉండండి
Indians Health: తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో అతను బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి గురించి వివరించారు. మన దేశంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట.
ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న వ్యాధులలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే, ఈ వ్యాధి ఇశత సీరియస్ గా ఉన్నప్పటికీ, దాని గురించి అవగాహన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. తాజాగా ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ధోనీ ఓ వీడియోను షేర్ చేసి స్ట్రోక్ లక్షణాల గురించి ప్రజలకు వివరించాడు. నేడు ప్రతి 20 సెకన్లకు ఒక భారతీయుడు స్ట్రోక్ కు గురవుతున్నాడని ధోనీ చెప్పాడు. అటువంటి పరిస్థితిలో, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటో, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?
బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా అకస్మాత్తుగా తగ్గే పరిస్థితి. తక్కువ రక్త సరఫరా కారణంగా, మెదడుకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు లభించవు. దీని వల్ల మెదడు కణాలు చనిపోతాయి. ఈ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, స్ట్రోక్ లక్షణాలను వెంటనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చు.
స్ట్రోక్ లక్షణాలు ఇవిగో
ధోని తన అవగాహన ప్రచారంలో స్ట్రోక్ లక్షణాల గురించి కూడా చెప్పాడు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గుర్తుంచుకోవడానికి 'BEFAST' అనే ఫార్ములాను ఆయన ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కో అక్షరం ఒక లక్షణంతో ముడిపడి ఉంటుంది. వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం.
* 'బి' అంటే బ్యాలెన్స్ క్షీణించడం - అకస్మాత్తుగా మీ శరీరం సమతుల్యత కోల్పోవడం ప్రారంభిస్తే, నడకలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. మైకము కమ్మినట్టు అనిపించినా, మీ శరీరం అదుపులో ఉన్నట్టు అనిపించకపోతే మీకు బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.
* 'ఇ'లో కంటిచూపు - ఆంగ్ల అక్షరం E అనేది ఇక్కడ Eyes ను సూచిస్తుంది. అకస్మాత్తుగా మీకు కళ్లు మసకబారడం లేదా దృష్టి సమస్యలు ఏర్పడితే అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఆలస్యం చేయకుండా మంచి వైద్యుడిని సంప్రదించండి.
* 'ఎఫ్' అంటే ముఖం లాగడం - ఆంగ్ల అక్షరం F అనేది Face అనే పదాన్ని సూచిస్తుంది. మీకు అకస్మాత్తుగా ముఖం ఒకవైపు లాగినట్టు అయితే మీరు వెంటనే జాగ్రత్తపడాలి. ఈ పరిస్థితిలో కూడా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణంగానే చెప్పుకోవాలి.
* 'ఎ' అంటే చేతులు బలహీనపడటం - ఆంగ్ల అక్షరం A అనేది Arms అనే పదాన్ని సూచిస్తుంది. చేతులు అకస్మాత్తుగా బలహీనంగా అనిపిస్తే ఇది స్ట్రోక్ లక్షణం కావచ్చు. ఇందుకోసం రెండు చేతులను పైకి లేపాలి. చేతులు నీరసంగా మారినా, వెంటనే అవి కింద పడి పోయినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే అవి స్ట్రోక్ లక్షణాలు కావచ్చు.
* 'ఎస్' అంటే మాట్లాడటంలో ఇబ్బంది - ఆంగ్ల అక్షరం S అనేది ఇక్కడ Speak అనే పదార్థాన్ని సూచిస్తుంది. మీకు మాట్లాడటంలో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. మాట్లాడేటప్పుడు నాలుక తడబడటం, మాట్లాడటంలో ఇబ్బంది ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందేమో చెక్ చేసుకోవాలి.
* 'టి' అంటే సకాలంలో చర్యలు తీసుకోవడం - ఇక్కడ ఆంగ్ల అక్షరం T అంటే Timely Action అని అర్థం. మీరు చర్యకు ప్రతిచర్య మీలో ఆలస్యమైతే బ్రెయిన్ సరిగా పనిచేయడం లేదని అర్థం. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. బ్రెయిన్ స్ట్రోక్ ఒక తీవ్రమైన వ్యాధి, కాబట్టి సరైన సమయంలో తీసుకునే సహాయం ప్రాణాలను కాపాడుతుంది.
(క్రెడిట్: @emcurepharma_ ఇన్స్టాగ్రామ్)
టాపిక్