తెలుగు న్యూస్ / ఫోటో /
Encumbrance Certificate Download : 5 నిమిషాల్లోనే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ డౌన్ లోడ్- ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
Encumbrance Certificate Download : ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) ఆస్తి యాజమాన్యాన్ని ధృవీకరించే ముఖ్యమైన సర్టిఫికెట్. ఏపీ ప్రభుత్వం ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 5 నిమిషాల్లో ఈసీని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
(1 / 6)
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) ఆస్తి యాజమాన్యాన్ని ధృవీకరించే ముఖ్యమైన సర్టిఫికెట్. ఆస్తుల కొనుగోలు సమయంలో ముందుగా ఈసీ తీసుకుంటారు. ఆస్తుల క్రయ, విక్రయాలకు ఆర్థిక లేదా చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఈసీ ద్వారా నిర్థారణ చేసుకుంటారు. దీనిని ఆస్తి ధృవీకరణ పత్రం అని కూడా అంటారు.
(2 / 6)
ఏపీ ప్రభుత్వం ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 5 నిమిషాల్లో ఈసీని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. సబ్-రిజిస్ట్రార్ లేదా మీ-సేవా కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్ లైన్ లో ఈసీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎక్కచి నుంచైనా ఈసీ సర్టిఫైడ్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఆన్ లైన్ లో చెల్లింపులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
(3 / 6)
ఆస్తిపై ఎన్‌కంబరెన్స్ స్టేట్‌మెంట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో https://cardprimme.rs.ap.gov.in/PDE/ECRegistrationPage ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఈసీ వివరాలు పొందవచ్చు.
(4 / 6)
ఈసీ ద్వారా ఆస్తి యాజమాన్యం హక్కులు. ఏదైనా తనఖాలు, తాత్కాలిక హక్కులు లేదా చట్టపరమైన బకాయిలు, ఆస్తి చట్టపరమైన, ఆర్థిక చరిత్ర, ఏదైనా పెండింగ్ బకాయిలు, ఆస్తి వివరణ, ఆన్ లైన్ తేదీ, బుక్ నంబర్, వాల్యూమ్ నంబర్, డాక్యుమెంట్ నంబర్‌తో సహా లావాదేవీల సమాచారం తెలుస్తుంది. ఆస్తుల క్రయ, విక్రయాల లావాదేవీలో పాల్గొన్న వ్యక్తుల పేర్లు ఈసీ ద్వారా తెలుస్తోంది.
(5 / 6)
ఆస్తి కొనుగోలుదారులు, విక్రేతలకు ఈసీ ముఖ్యమైనది ఎందుకంటే ఆస్తుల నిజమైన వారసులు, యాజమాన్యం హక్కులను నిర్ధారిస్తుంది. అలాగే వారసత్వ బాధ్యతల నుంచి కొనుగోలుదారులను రక్షిస్తుంది. అలాగే మోసపూరిత లావాదేవీలను నిరోధిచేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు ఆస్తి విలువ, వినియోగం, హక్కులను అంచనా వేయడంలో యజమానులు, కొనుగోలుదారులు, లోన్లు ఇచ్చేవారికి సహాయపడుతుంది.
ఇతర గ్యాలరీలు