
(1 / 6)
“రీసెంట్‍గా మీరు చూసిన సినిమా లేదా షో ఏది” అని నటి మందిరా బేడీ.. ఓ ఈవెంట్‍లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనికి రోహిత్ సమాధానం చెప్పారు.
(PTI)
(2 / 6)
తాను ఇటీవల 12th ఫెయిల్ అనే సినిమా చూశానని రోహిత్ శర్మ చెప్పారు. ఆ మూవీని ప్రశంసించారు.
(PTI)
(3 / 6)
12th ఫెయిల్ చాలా మంచి మూవీ అని రోహిత్ శర్మ అన్నారు. చాలా స్ఫూర్తివంతమైన సినిమా అని మందిర బేడీ కూడా అన్నారు.
(PTI)
(4 / 6)
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితంపై 12th ఫెయిల్ చిత్రం తెరకెక్కింది. మారుమూల ప్రాంతం, పేద కుటుంబం నుంచి వచ్చి.. ఓ దశలో 12వ తరగతి ఫెయిల్ అయినా.. అన్ని కష్టాలను దాటి ఐపీఎస్ అయ్యారు మనోజ్. 12th ఫెయిల్ చిత్రాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరక్కించారు.

(5 / 6)
12th ఫెయిల్ చిత్రంలో మనోజ్ కుమార్ పాత్రలో విక్రాంత్ మాసే నటించారు. థియేటర్లలో ఈ చిత్రం మంచి హిట్ అయింది. ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా మంది ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

(6 / 6)
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‍తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‍లో మూడో టెస్టు రాజ్‍కోట్ వేదికగా ఫిబ్రవరి 15వ తేదీన మొదలుకానుంది.
(ANI)ఇతర గ్యాలరీలు