తెలుగు న్యూస్ / ఫోటో /
Kia Carens Review: కియా కేరెన్స్ 1.5 టర్బో డీసీటీ రివ్యూ..
- Kia Carens Review: కేరెన్స్ మోడల్ లో గతంలో ఉన్న 1.4 లీటర్ టర్బో ఇంజన్ స్థానంలో కియా ఇప్పుడు 1.5 లీటర్ టర్బో ఇంజన్ ను అమర్చింది. ఈమార్పుతో పాటు కొత్త మోడల్ లోని కొత్త ఫీచర్స్ ఏంటో చూద్దాం..
- Kia Carens Review: కేరెన్స్ మోడల్ లో గతంలో ఉన్న 1.4 లీటర్ టర్బో ఇంజన్ స్థానంలో కియా ఇప్పుడు 1.5 లీటర్ టర్బో ఇంజన్ ను అమర్చింది. ఈమార్పుతో పాటు కొత్త మోడల్ లోని కొత్త ఫీచర్స్ ఏంటో చూద్దాం..
(1 / 9)
ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి MPV లు చాలా ఉపయోగకరం. కానీ వాటి డిజైన్ చాలా మందికి అంతగా నచ్చదు. అయతే, భారత మార్కెట్‌లోని ఇతర MPVలతో పోల్చినప్పుడు కేరెన్స్ ప్రత్యేకంగా ఉండేలా కియా చూసుకుంది.
(2 / 9)
కియా కేరెన్స్ ఇంటీరియర్ ను చాలా ప్రీమియం లుక్ తో కియా తీర్చిదిద్దింది. డ్యూయల్-టోన్ థీమ్ క్యాబిన్ గ్రాండ్ లుక్ ను ఇస్తుంది.అయితే, ఇందులోని గ్లోస్ బ్లాక్ ఎలిమెంట్స్ చాలా తేలికగా మురికిగా మారతాయి. అలాగే, గీతలు పడే అవకాశం కూడా ఉంది.
(3 / 9)
కియా కేరెన్ లో కొన్ని నెలల క్రితం, 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1.5-లీటర్ టర్బో యూనిట్ ను కియా తీసుకు వచ్చింది. కొత్త ఇంజన్ 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లతో వచ్చింది.
(4 / 9)
1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ డైరెక్ట్ ఇంజెక్షన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 158 బిహెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌పై 20 bhp, 11 Nm టార్క్ ఎక్కువ.
(5 / 9)
7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ చాలా వరకు స్మూత్ గా ఉంటుంది. దీనిలో ప్యాడిల్ షిఫ్టర్‌లు ఉన్నాయి, వీటి ద్వారా డ్రైవర్ గేర్‌బాక్స్ ను మాన్యువల్ నియంత్రణ లోకి తీసుకోవచ్చు.
(6 / 9)
ఈ ఎంపీవీలో మూడవ-వరుస క్రింద భారీ బూట్ స్పేస్ ఉంది. అయితే, థర్డ్ రో సీట్స్ ను ఉపయోగిస్తే, బూట్ స్పేస్ గణనీయంగా తగ్గుతుంది. ఈ థర్డ్ రో (third-row) లో మొబైల్ ఛార్జింగ్, హెడ్‌రెస్ట్స్, రిక్లైన్ యాంగిల్, కప్ హోల్డర్‌లు, బ్లోవర్, ఆర్మ్ రెస్ట్, USB పోర్ట్ తదితర సదుపాయాలు ఉన్నాయి.
(7 / 9)
రైడ్ క్వాలిటీ విషయానికి వస్తే, కేరెన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సస్పెన్షన్ పని తీరు బావుంది. స్టీరింగ్ తేలికగా ఉండటం వల్ల నగరాల్లో నడపడం చాలా సులభం.
(8 / 9)
నగరాల్లో, ట్రాఫిక్ పరిస్థితుల్లో మైలేజీ లీటరుకు 10 కిమీలు మాత్రమే వస్తుంది. కానీ హైవేలపై ఇది లీటరుకు 17కిమీల వరకు వస్తుంది. సరైన విధానంలో డ్రైవ్ చేస్తే మైలేజీ మరింత మెరుగుపడుతుంది.
ఇతర గ్యాలరీలు