తెలుగు న్యూస్ / ఫోటో /
ఇండియాలో రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3, బుక్ ప్రైమ్ లాంచ్.. ధర ఎంతంటే!
ప్రముఖ స్మార్ట్ మెుబైల్ సంస్థ రియల్ మీ తన నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. Realme తన AIOT పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త TWS బడ్స్, నోట్‌బుక్‌ను లాంచ్ చేసింది. Realme Buds Air 3, Realme Book Prime పేరుతో న్యూ బ్రాండ్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది
ప్రముఖ స్మార్ట్ మెుబైల్ సంస్థ రియల్ మీ తన నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. Realme తన AIOT పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త TWS బడ్స్, నోట్‌బుక్‌ను లాంచ్ చేసింది. Realme Buds Air 3, Realme Book Prime పేరుతో న్యూ బ్రాండ్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది
(1 / 5)
Realme Buds Air 3.. రియల్ మీ విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ TWS ఇయర్‌బడ్స్. ఇవి ప్రీమియం సౌండ్ క్వాలిటీ, అత్యుత్తమ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనుభవంతో... ట్రెండీ లుక్‌ను కలిగి ఉంటుంది. డిప్ బాస్, రిచ్ సౌండ్ కోసం న్యూ లిక్విడ్ క్రిస్టల్ పాలిమర్ కాంపోజిట్‌తో తయారు చేసిన 10mm పెద్ద డ్రైవర్‌ను అమర్చారు.(Realme)
(2 / 5)
రియల్ మీ బడ్స్ ఎయిర్ 3 అనేది.. TÜV రైన్‌ల్యాండ్ హై-పెర్ఫార్మెన్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా ధృవీకరించబడిన మొదటి TWS ఇయర్‌బడ్‌లు. అడాప్టెడ్ అడ్వాన్స్‌డ్ R3 చిప్‌తో పాటు సెగ్మెంట్‌లోని ఉత్తమ నాయిస్ క్యాన్సిలేషన్ అల్గారిథమ్‌ల సహాయంతో విస్తృతమైప 42dB నాయిస్ క్యాన్సిలేషన్‌ను ఇందులో అందజేశారు.(Realme)
(3 / 5)
TWS ఇయర్‌బడ్‌లు ఇండస్ట్రీ-లీడింగ్ డి-విండ్ డిజైన్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఈ ఆప్షన్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ TWS ఇయర్‌బడ్‌లలో మాత్రమే కనిపిస్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా సౌకర్యవంతంగా ఇవి పనిచేస్తాయి. ఇవి మల్టీ అంతర్నిర్మిత మైక్రోఫోన్‌లను కలిగి ఉంటాయి. ఈ ఆధునిక ఫీచర్స్ వల్ల క్వాలిటీ సౌండ్ అనుభవాన్ని అస్వాదించవచ్చు.(Realme)
(4 / 5)
ఇక రియల్ మీ బుక్ ప్రైమ్ విషయానికి వస్తే.. గత సంవత్సరం అత్యంత విజయవంతమైన రియల్‌మీ బుక్ స్లిమ్‌కు కొనసాగింపుగా బుక్ ప్రైమ్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఇందులో 11వ-జెన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ను అమర్చారు. సింగిల్-కోర్ పనితీరులో 9.6% పెరుగుదల ఉండగా.. మల్టీ కోర్‌లో 21.8% పెరుగుదల ఉంది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే ప్రధాన తేడా ఇదే.(Realme)
(5 / 5)
రియల్ మీ బుక్ ప్రైమ్‌లో అధునాతన వ్యాపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు, ఇందులో అల్ట్రా-థిన్.. హై-స్పీడ్, హై-ఎయిర్‌ఫ్లో వంటి రెండు ఫ్యాన్‌లు ఉన్నాయి, కూలింగ్ సిస్టమ్ 32.7% మరింత ప్రభావవంతంగా ఉంటుంది. టాప్-గ్రేడ్ సామర్థ్యాన్ని అందిస్తూ, రియల్ మీ బుక్ ప్రైమ్ కూడా CPU వాటేజీని పెంచుతుంది. దీని ఫలితంగా పవర్ డిస్సిపేషన్ 50% పెరుగుతుంది. Realme Book Prime స్పెషల్ గ్రీన్ కలర్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.(Realme)
ఇతర గ్యాలరీలు