RCB vs DC: ఒక్క రన్ తేడాతో ఆర్సీబీ ఓటమి.. రిచా అద్భుత పోరాటం వృథా.. ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ-rcb lost by 1 run against delhi capitals in wpl 2024 richa ghosh shows excellent fight cricket news in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rcb Vs Dc: ఒక్క రన్ తేడాతో ఆర్సీబీ ఓటమి.. రిచా అద్భుత పోరాటం వృథా.. ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ

RCB vs DC: ఒక్క రన్ తేడాతో ఆర్సీబీ ఓటమి.. రిచా అద్భుత పోరాటం వృథా.. ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ

Mar 10, 2024, 11:55 PM IST Chatakonda Krishna Prakash
Mar 10, 2024, 11:43 PM , IST

  • RCB vs DC - WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో కీలక మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. నేడు (మార్చి 10) జరిగిన ఈ మ్యాచ్‍లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరింది.

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు హాట్ బ్రేకింగ్ ఓటమి ఎదురైంది. ఢిల్లీ వేదికగా నేడు (మార్చి 10) జరిగిన మ్యాచ్‍లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. 

(1 / 7)

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు హాట్ బ్రేకింగ్ ఓటమి ఎదురైంది. ఢిల్లీ వేదికగా నేడు (మార్చి 10) జరిగిన మ్యాచ్‍లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. (PTI)

గెలుపు కోసం చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి సిక్సర్ బాదారు బెంగళూరు బ్యాటర్ రిచా ఘోష్. ఆ తర్వాత మూడు బంతులకు మూడు రన్సే వచ్చాయి. అయితే, ఐదో బంతికి సిక్సర్ కొట్టారు రిచా. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. రిచా కొట్టిన బంతి నేరుగా ఫీల్డర్ షెఫాలీ వర్మ చేతికి వెళ్లింది. దీంతో పరుగుకు వెళ్లిన ఆమె రనౌట్ అయ్యారు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓడింది. 

(2 / 7)

గెలుపు కోసం చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి సిక్సర్ బాదారు బెంగళూరు బ్యాటర్ రిచా ఘోష్. ఆ తర్వాత మూడు బంతులకు మూడు రన్సే వచ్చాయి. అయితే, ఐదో బంతికి సిక్సర్ కొట్టారు రిచా. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. రిచా కొట్టిన బంతి నేరుగా ఫీల్డర్ షెఫాలీ వర్మ చేతికి వెళ్లింది. దీంతో పరుగుకు వెళ్లిన ఆమె రనౌట్ అయ్యారు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓడింది. (PTI)

29 బంతుల్లోనే 51 పరుగులు చేసి అద్భుతంగా పోరాడారు రిచా ఘోష్. 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదారు. అయితే, చివర్లో ఓటమి ఎదురవటంతో పోరాటం వృథా అయింది. దీంతో రిచా చాలా గ్రౌండ్‍లోనే కింద కూర్చొని బాధపడ్డారు.  

(3 / 7)

29 బంతుల్లోనే 51 పరుగులు చేసి అద్భుతంగా పోరాడారు రిచా ఘోష్. 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదారు. అయితే, చివర్లో ఓటమి ఎదురవటంతో పోరాటం వృథా అయింది. దీంతో రిచా చాలా గ్రౌండ్‍లోనే కింద కూర్చొని బాధపడ్డారు.  (PTI)

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (58) హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. 

(4 / 7)

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (58) హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. (PTI)

లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 రన్స్ చేసింది బెంగళూరు. రిచా ఘోష్ చివరి వరకు పోరాడినా.. ఒక్క రన్‍తో ఓటమి ఎదురైంది. ఎలీస్ పెర్రీ (49) కూడా రాణించారు. 

(5 / 7)

లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 రన్స్ చేసింది బెంగళూరు. రిచా ఘోష్ చివరి వరకు పోరాడినా.. ఒక్క రన్‍తో ఓటమి ఎదురైంది. ఎలీస్ పెర్రీ (49) కూడా రాణించారు. (PTI)

ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 7 మ్యాచ్‍ల్లో ఐదు విజయాలతో డబ్ల్యూపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో టాప్‍కు చేరింది.

(6 / 7)

ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 7 మ్యాచ్‍ల్లో ఐదు విజయాలతో డబ్ల్యూపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో టాప్‍కు చేరింది.(PTI)

స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 7 మ్యాచ్‍ల్లో 3 గెలిచి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. లీగ్ దశలో మిగిలిన మరో మ్యాచ్‍లో గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ముంబై కూడా ప్లేఆఫ్స్ చేరింది. యూపీ వారియర్స్ (6 పాయింట్లు), గుజరాత్ జెయింట్స్ (2) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఐదు జట్లలో మూడు మాత్రమే ప్లేఆఫ్స్ చేరనున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ అర్హత సాధించగా.. మూడో ప్లేస్ కోసం బెంగళూరు, యూపీ, గుజరాత్ పోటీపడనున్నాయి.  

(7 / 7)

స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 7 మ్యాచ్‍ల్లో 3 గెలిచి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. లీగ్ దశలో మిగిలిన మరో మ్యాచ్‍లో గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ముంబై కూడా ప్లేఆఫ్స్ చేరింది. యూపీ వారియర్స్ (6 పాయింట్లు), గుజరాత్ జెయింట్స్ (2) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఐదు జట్లలో మూడు మాత్రమే ప్లేఆఫ్స్ చేరనున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ అర్హత సాధించగా.. మూడో ప్లేస్ కోసం బెంగళూరు, యూపీ, గుజరాత్ పోటీపడనున్నాయి.  (PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు