తెలుగు న్యూస్ / ఫోటో /
Rashid Khan Record: అరుదైన రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్.. ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా..
- Rashid Khan Record: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరో మైలురాయి దాటాడు. టీ20 క్రికెట్‍లో 600 వికెట్లను సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మార్క్ దాటిన పిన్న వయస్కుడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు.
- Rashid Khan Record: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరో మైలురాయి దాటాడు. టీ20 క్రికెట్‍లో 600 వికెట్లను సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మార్క్ దాటిన పిన్న వయస్కుడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు.
(1 / 5)
అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ స్పిన్ మాయాజాలంతో మెరిపిస్తూనే ఉన్నాడు. అఫ్గాన్ జట్టుతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా లీగ్‍ల్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్, బిగ్‍బాష్, సీపీఎల్, పీపీఎల్ ఇలా మరిన్ని లీగ్‍ల్లో బరిలోకి దిగుతుంటాడు. ప్రతీ చోట రాణిస్తూ వికెట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు రషీద్.
(2 / 5)
రషీద్ ఖాన్ తాజాగా ఓ అరుదైన మైలురాయిని దాటాడు. టీ20 క్రికెట్‍లో (అంతర్జాతీయ, లీగ్‍లు కలిపి) 600 వికెట్ల మార్క్ చేరాడు. ది హండ్రెడ్స్ లీగ్‍లో ట్రెంట్ రాకెట్స్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్ నేడు (జూలై 30).. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‍లో రెండు వికెట్లు తీశాడు. దీంతో 600 వికెట్ల మైల్‍స్టోన్ అధిగమించాడు. (హండ్రెడ్స్ లీగ్ గణాంకాలు కూడా టీ20ల కిందే లెక్కలోకి వస్తున్నాయి)
(3 / 5)
టీ20 క్రికెట్‍లో 600 వికెట్ల మైలురాయి సాధించిన రెండో ప్లేయర్‌గా రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ లెజెండ్ డ్వైన్ బ్రావో (630 వికెట్లు) మాత్రమే తొలుత ఈ ఘనత సాధించాడు. అత్యధిక టీ20 వికెట్ల జాబితాలో బ్రావో, రషీద్ తర్వాత సునీల్ నరైన్ (557), ఇమ్రాన్ తాహిర్ (502) ఉన్నారు.
(4 / 5)
ఇప్పటి వరకు 441 టీ20ల్లో 600 వికెట్లు తీశాడు రషీద్ ఖాన్. అఫ్గానిస్థాన్ తరపున అంతర్జాతీయ టీ20ల్లో 152 వికెట్లు తీశాడు. మిగిలినవి వివిధ టీ20 లీగ్‍ల్లో దక్కించుకున్నాడు.
ఇతర గ్యాలరీలు