(1 / 10)
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. నేడు (జనవరి 22) జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అపూర్వ ఘట్టంలో భాగమయ్యారు. రామమందిరం ముందు సెల్ఫీ దిగిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(2 / 10)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్.. రామ మందిర వేడుకకు హాజరైన దృశ్యమిది. వారి ముందు వరుసలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, మాజీ అథ్లెట్ పీటీ ఉష ఉన్నారు.
(3 / 10)
శ్రీ రామజన్మభూమి ఆలయం ప్రారంభోత్సవానికి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు.
(PTI)(4 / 10)
బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, రణ్‍బీర్ కపూర్, కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఈ వేడుకకు వచ్చారు.
(5 / 10)
రామమందిరం వద్ద కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ నిలబడిన దృశ్యమిది.
(PTI)(6 / 10)
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాల్గొన్న దృశ్యమిది.
(7 / 10)
రామమందిరం ముందు బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఇలా ఫొటో దిగారు.
(PTI)(8 / 10)
అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవంలో ప్రసూన్ జోషి, శంకర్ మహదేవన్, రామ్‍చరణ్ కలిశారు.
(9 / 10)
ఈ వేడుకలో సింగర్ అనురాధ పౌడ్వాల్ పాట పాడారు. తనకు సంతోషంతో మాటలు రావడం లేదని అన్నారు.
(PTI)(10 / 10)
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలో భజనను పాడారు ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
(PTI)ఇతర గ్యాలరీలు