TS AP Weather : మరో 5 రోజులు వానలు..! ఎల్లో హెచ్చరికలు జారీ
- Rains in Telangana - AP: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీగా వానలు పడుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలంగాణలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(2 / 6)
హైదరాబాద్ నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. వర్షంలోనే వినాయక నిమజ్జనాలు కొనసాగాయి. వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. (https://unsplash.com)
(3 / 6)
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో అక్టోబర్ 2వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. (https://unsplash.com)
(4 / 6)
నిర్మల్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సిద్దిపేటతో పాటు జిల్లాల్లోనూ గురువారం వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తడ్వాల్‌లో 11.8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.(https://unsplash.com)
(5 / 6)
ఏపీకి కూడా రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. గురువారం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.(https://unsplash.com)
(6 / 6)
రేపు (29-09-23) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతిపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది (https://unsplash.com)
ఇతర గ్యాలరీలు