తెలుగు న్యూస్ / ఫోటో /
AP Weather Updates : ఏపీకి మరోసారి IMD కూల్ న్యూస్ - మరో రెండు రోజులు వర్షాలు..! వెదర్ రిపోర్ట్ వివరాలివే
- Andhrapradesh Weather Updates : ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఐఎండీ తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Andhrapradesh Weather Updates : ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఐఎండీ తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండదా… మరోవైపు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. (Photo Source From https://unsplash.com/)
(2 / 7)
ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది.(Photo Source From https://unsplash.com/)
(3 / 7)
అయితే దక్షిణ కోస్తాలో మాత్రం… పొడి వాతావరణమే ఉంటుందని ఐఎండీ తెలిపింది. కొన్నిచోట్ల అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.(Photo Source From https://unsplash.com/)
(4 / 7)
ఇక ఈ సమ్మర్ లో సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాలతో పోల్చితే… ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే సీమ జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ.(Photo Source From https://unsplash.com/)
(5 / 7)
ఇవాళ, రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపలతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పింది.(Photo Source From https://unsplash.com/)
(6 / 7)
ఇక ఇవాళ(ఏప్రిల్ 12) గుంటూరులో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఏటూకూరు బైపాస్ దగ్గర ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.(Photo Source From https://unsplash.com/)
(7 / 7)
ఇక ఏపీలో రేపు ,ఎల్లుండి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రేపు(ఏప్రిల్ 13) 57 మండలాల్లో, ఎల్లుండి 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 111 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. (Photo Source From https://unsplash.com/)
ఇతర గ్యాలరీలు