AP Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు, పంటల్ని కాపాడుకోవాలని రైతులకు అలర్ట్‌-rains are again flooding in ap alert to farmers to protect their crops ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు, పంటల్ని కాపాడుకోవాలని రైతులకు అలర్ట్‌

AP Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు, పంటల్ని కాపాడుకోవాలని రైతులకు అలర్ట్‌

Nov 11, 2024, 09:06 AM IST Bolleddu Sarath Chandra
Nov 11, 2024, 09:06 AM , IST

  • AP Rains Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడన ఏర్పడనుండటంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మంగళవారం నుంచి వర్షాలు కురవనున్నాయి. ఖరీఫ్‌ పంటలు చేతికి అందే సమయం కావడంతో  రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. 

(1 / 8)

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

(2 / 8)

అల్పపీడనం ప్రభావంతో  మంగళ, బుధ,గురువారాల్లో(12,13,14 తేదీల్లో) రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

(3 / 8)

నవంబర్ 11, సోమవారం • కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(4 / 8)

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా   తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది.

(5 / 8)

నవంబర్ 12, మంగళవారం నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.•  విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(6 / 8)

నవంబర్ 13 బుధవారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.• ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(7 / 8)

బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడే అల్పపీడన తర్వాత రెండు రోజుల్లో  అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు  కదులుతుందని వెల్లడించారు. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు