తెలుగు న్యూస్ / ఫోటో /
GT vs PBKS Highlights: ఛేజింగ్‌లో రారాజు పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ రికార్డ్ బ్రేక్
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయంతో ఛేజింగ్‌లో కొత్త రికార్డ్ నెలకొల్పింది. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
(1 / 7)
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చివరి బాల్ వరకు థ్రిల్లింగ్‌గా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్‌ను మరో బాల్ మిగిలుండగానే పంజాబ్ కింగ్స్ ఛేజ్ చేసింది. 19.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
(2 / 7)
కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో శుభ్‌మన్ గిల్ గుజరాత్‌కు భారీ స్కోరు అందించాడు. 48 బాల్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 89 రన్స్ చేశాడు. అతడి పోరాటం వృథాగా మారింది.
(3 / 7)
ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ అసమాన పోరాటంతో పంజాబ్ కింగ్స్‌కు తిరుగులేని విజయం అందించారు.
(4 / 7)
శశాంక్ సింగ్ 29 బాల్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులతో అదరగొట్టాడు. అషుతోష్ శర్మ 17 బాల్స్‌లో 31 రన్స్ చేశాడు.
(5 / 7)
ఈ గెలుపుతో ఛేంజింగ్స్‌లో పంజాబ్ కింగ్స్ అరుదైన రికార్డ్ నెలకొల్పింది. ఐపీఎల్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఎక్కువ సార్లు ఛేజ్ చేసిన జట్టుగా నిలిచింది.
(6 / 7)
200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ ఆరు సార్లు ఛేజ్ చేయగా... ఐదు సార్లలో ముంబై ఇండియన్స్ ఈ లెస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లు ఉంది. తలో మూడు సార్లు రెండు వందల టార్గెట్ ఛేదించిన చెన్నై, కోల్‌కతా మూడో స్థానంలో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు