Edible Oil Prices: ఏపీలో భారీగా పెరిగిన వంట నూనెల ధరలు.. రంగంలోకి దిగిన విజిలెన్స్, అక్రమ వ్యాపారులపై కేసుల నమోదు
- Edible Oil Prices: రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మాత్తుగా పెరిగిన వంట నూనెల ధరలతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అనధికార నిల్వలు, వ్యాపారలపై విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.సామాన్య వినియోగదారులపై భారంపడే ఆకస్మిక ధరల్ని నియంత్రించి,తప్పుచేసిన వారిపై చర్యలకు విజిలెన్స్ డీజీ ఆదేశించారు.
- Edible Oil Prices: రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మాత్తుగా పెరిగిన వంట నూనెల ధరలతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అనధికార నిల్వలు, వ్యాపారలపై విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.సామాన్య వినియోగదారులపై భారంపడే ఆకస్మిక ధరల్ని నియంత్రించి,తప్పుచేసిన వారిపై చర్యలకు విజిలెన్స్ డీజీ ఆదేశించారు.
(2 / 9)
వంటనూనెలపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందన్న పుకార్ల నేపథ్యంలో పామోలిన్, ఇతర ఎడిబుల్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, కల్తీ పై ఆవిజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా కస్మిక తనిఖీలు నిర్వహించారు.
(3 / 9)
వంటనూనెలపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందన్న పుకార్ల నేపథ్యంలో పామోలిన్, ఇతర ఎడిబుల్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, కల్తీ పై విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
(4 / 9)
ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య వినియోగదారులపై భారంపడే ఆకస్మిక ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విజిలెన్స్ ప్రకటించింది. ధరలు పెంచి, తప్పుచేసిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
(5 / 9)
రాష్ట్ర వ్యాప్తంగా చిల్లర దుకాణాలు మొదలుకుని, హోల్‌సేల్ దుకాణాల వరకు ఒక్కసారిగా వంట నూనెల ధరల్ని పెంచేశాయి
(6 / 9)
పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్ కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిల్లర్లు, స్టాకిస్ట్ లు, రిటైలర్లపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని యూనిట్ల ఆర్ వీఈవో లకు విజిలెన్స్ విభాగం అధికారులు ఆదేశించారు.
(7 / 9)
హోల్ సేల్ వ్యాపారులు పాత స్టాకును కూడా కొత్త ధరలకు అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడితే కేసుల నమోదుతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
(8 / 9)
ఏపీలోని 12 యూనిట్ల పరిధిలో 26 జిల్లాలో సుమారు 50 బృందాలతో మిల్లర్లు, స్టాకిస్ట్ లు, రిటైలర్లు, వ్యాపారులు, సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఇతర గ్యాలరీలు