తెలుగు న్యూస్ / ఫోటో /
Porsche 911 Turbo S । బరువు అమాంతం తగ్గింది.. మరి రేసులో దూసుకెళ్తుందా?
- సూపర్ కార్ 'పోర్షే 911 టర్బో S' ఇప్పుడు లెజెండరీ పైక్స్ పీక్ హిల్ క్లైంబ్ 100వ రన్నింగ్ ఈవెంట్ కోసం సిద్ధమైంది. అత్యంత వేగవంతమైన రికార్డులను నెలకొల్పడానికి ఈ కారుకు సుమారు 36 కిలోల వరకు బరువును తగ్గించారు.
- సూపర్ కార్ 'పోర్షే 911 టర్బో S' ఇప్పుడు లెజెండరీ పైక్స్ పీక్ హిల్ క్లైంబ్ 100వ రన్నింగ్ ఈవెంట్ కోసం సిద్ధమైంది. అత్యంత వేగవంతమైన రికార్డులను నెలకొల్పడానికి ఈ కారుకు సుమారు 36 కిలోల వరకు బరువును తగ్గించారు.
(1 / 8)
Pikes Peak ఈవెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కారుగా Porsche 911 Turbo S ఇప్పుడు స్వచ్ఛమైన స్టాక్ మోడల్‌గా వస్తుంది.
(2 / 8)
Porsche 911 Turbo S లైట్‌వెయిట్ ప్యాకేజీగా మార్చేందుకు ఈ కారును మునుపటి మోడల్ కంటే 36 కిలోల బరువును తగ్గించినట్లు పేర్కొన్నారు.
(3 / 8)
పోర్స్చే 911 టర్బో S కారుకు లైట్‌వెయిట్ ప్యాకేజీలో భాగంగా సౌండ్ ఇన్సులేషన్, సన్నగా ఉండే గ్లాస్ ఇచ్చారు. వెనుక సీటుకు PASM స్పోర్ట్స్ సస్పెన్షన్ ఉంది. దీని ఎత్తును భూమికి 10 మిమీ తగ్గించారు.
(4 / 8)
Porsche 911 Turbo S కారులో వెనుక సీట్లను పూర్తిగా తొలగించారు. అలాగే ముందు భాగంలో తేలికైన కార్బన్ ఫైబర్ బకెట్ సీట్లను అమర్చారు.
(5 / 8)
బరువు తగ్గించడంలో భాగంగా కారులో 991-తరం 911 టర్బో S నుంచి మొత్తం 80lbsని తొలగించింది. తద్వారా కాంటినెంటల్ GT రికార్డును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకొంది.
(6 / 8)
ఈ పోర్షే 911 టర్బో Sలో 3.7-లీటర్ ఫ్లాట్-6 ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 640 hp శక్తిని, 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(7 / 8)
మరి ఇన్ని మార్పులు చేసిన తర్వాతైనా ఈ పోర్షే 911 టర్బో S కార్ పైక్స్ పీక్ ఈవెంట్లో రికార్డును నెలకొల్పగలదా? అది ఈ నెలాఖరులో తెలుస్తుంది.
ఇతర గ్యాలరీలు