
(1 / 6)
బుధవారం తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ. వేములవాడ, వరంగల్ లో నిర్వహించిన సభల్లో పాల్గొని ప్రసంగించారు.
(@narendramodi twitter)
(2 / 6)
అయితే వరంగల్ కు వెళ్లే దారిలో ఓ యువ మిత్రుడిని కలిశారు మోదీ. ఇదే విషయాన్ని ట్విట్ (X ఖాతాలో) పోస్ట్ చేశారు. “వరంగల్ లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను” అంటూ ప్రధాని మోదీ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో తెగ వైరల్ అవుతోంది.
(@narendramodi twitter)
(3 / 6)
వరంగల్ లో తలపెట్టిన ప్రధాని మోదీ సభకు భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నాలుగో విడతలో కాంగ్రెస్ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదని ఎద్దేవా చేశారు, మైక్రోస్కోప్ కావాల్సిందే. అంటూ సెటైర్లు విసిరారు.
(@narendramodi twitter)
(4 / 6)
వరంగల్‌ను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి కాపాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. “కాంగ్రెస్ అబద్ధాలు ఎలా ఉంటాయో, తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, దాన్ని ఆగస్ట్ 15కు మార్చారు, ఇది మాట తప్పడం కాదా?.” అని రేవంత్ సర్కార్ ను మోదీ సూటిగా ప్రశ్నించారు.
(@narendramodi twitter)
(5 / 6)
వరంగల్ సభ కంటే ముందుగా వేములవాడ సభలో ప్రసంగించారు. సభకు హాజరయ్యే ముందుకు వేములవాడ రాజరాజేశ్వరుడిని దర్శించుకోని… ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
(@narendramodi twitter)
(6 / 6)
తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పార్టీల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహరావు వంటి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేదన్నారు. ఆయనకు భారతరత్నతో గౌరవించామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అవినీతి విషయంలో ఇద్దరు తోడు దొంగలేనని అన్నారు.లంగాణలో ఆర్ఆర్(రేవంత్, రాహుల్ గాంధీ) ట్యాక్స్ నడుస్తోందని దుయ్యబట్టారు. RR ట్యాక్స్ నుంచి తెలంగాణను విముక్తి చేయాలని కామెంట్స్ చేశారు.
ఇతర గ్యాలరీలు