Pakhal Lake Trip : ప్రకృతి అందాల నడుమ 'పాకాల సరస్సు'..! ఈ టూరిస్ట్ ప్లేస్ కు ఒకే రోజులో వెళ్లి రావొచ్చు..-pakhal lake is a man made lake in warangal district of telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pakhal Lake Trip : ప్రకృతి అందాల నడుమ 'పాకాల సరస్సు'..! ఈ టూరిస్ట్ ప్లేస్ కు ఒకే రోజులో వెళ్లి రావొచ్చు..

Pakhal Lake Trip : ప్రకృతి అందాల నడుమ 'పాకాల సరస్సు'..! ఈ టూరిస్ట్ ప్లేస్ కు ఒకే రోజులో వెళ్లి రావొచ్చు..

Aug 24, 2024, 08:49 AM IST Maheshwaram Mahendra Chary
Aug 24, 2024, 08:49 AM , IST

  • Warangal Pakhal Lake Trip: చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో నీరు, ఎక్కడ చూసినా పచ్చదనం, ఆ పక్కనే అభ్యయారణ్యం..! ఇలాంటి రమణీయమైన టూరిస్ట్ ప్లేస్ ను చూడాలంటే పాకాలకు వెళ్లాల్సిందే..! వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు దగ్గర్లో ఈ సరస్సు ఉంటుంది. వరంగల్ నగరం నుంచి 60 కి.మీ వెళ్తే ఇక్కడికి చేరుకోవచ్చు.

 చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో నీరు, ఎక్కడ చూసినా పచ్చదనం, ఆ పక్కనే అభ్యయారణ్యం..!  ఇలాంటి రమణీయమైన టూరిస్ట్ ప్లేస్ ను చూడాలంటే పాకాలకు వెళ్లాల్సిందే..! 

(1 / 6)

 చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో నీరు, ఎక్కడ చూసినా పచ్చదనం, ఆ పక్కనే అభ్యయారణ్యం..!  ఇలాంటి రమణీయమైన టూరిస్ట్ ప్లేస్ ను చూడాలంటే పాకాలకు వెళ్లాల్సిందే..! 

ఇటీవలే కురుసిన వర్షాలతో పాకాల సరస్సు ప్రస్తుతం నిండుకుండగా మారింది. చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం పర్యటకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా గడిపియవచ్చు. 

(2 / 6)

ఇటీవలే కురుసిన వర్షాలతో పాకాల సరస్సు ప్రస్తుతం నిండుకుండగా మారింది. చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం పర్యటకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా గడిపియవచ్చు. (image source from https://warangal.telangana.gov.in/)

వీకెండ్స్ కానీ సెలవు దినాల్లో కూడా పాకాల ట్రిప్ కు వెళ్తే మీ కుటుంబంతో హాయిగా గడిపవచ్చు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. నిర్ణయించిన ధరను చెల్లించి నీటి అలలపై రయ్… రయ్ అంటూ దూసుకెళ్లవచ్చు.

(3 / 6)

వీకెండ్స్ కానీ సెలవు దినాల్లో కూడా పాకాల ట్రిప్ కు వెళ్తే మీ కుటుంబంతో హాయిగా గడిపవచ్చు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. నిర్ణయించిన ధరను చెల్లించి నీటి అలలపై రయ్… రయ్ అంటూ దూసుకెళ్లవచ్చు.(image source from https://warangal.telangana.gov.in/)

30 చదరపు కి.మీ.లలో విస్తరించిన ఈ సరస్సును క్రీ శ.1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేయబడింది.ప్రస్తుతం వరంగల్ గ్రామీణ జిల్లా, నర్సంపేట సమీపంలో పాకాల సరస్సు ఉంది .

(4 / 6)

30 చదరపు కి.మీ.లలో విస్తరించిన ఈ సరస్సును క్రీ శ.1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేయబడింది.ప్రస్తుతం వరంగల్ గ్రామీణ జిల్లా, నర్సంపేట సమీపంలో పాకాల సరస్సు ఉంది .(image source from https://warangal.telangana.gov.in/)

ఈ సరస్సు ఒడ్డున 839 చదరుపు కి.మీ విస్తీర్ణంలో పాఖల్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం ఉంది. ఇది వివిధ రకాల జంతువులకు దట్టమైన అటవీ ఆశ్రయంగా పేరుగాంచింది. 

(5 / 6)

ఈ సరస్సు ఒడ్డున 839 చదరుపు కి.మీ విస్తీర్ణంలో పాఖల్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం ఉంది. ఇది వివిధ రకాల జంతువులకు దట్టమైన అటవీ ఆశ్రయంగా పేరుగాంచింది. 

పాకాల అభయారణ్యంలో అనేక రకాల అరుదైన జీవ జాతులు ఉంటాయి. ఇక పక్షి ప్రేమికులకు పాకాల అభయారణ్యం అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లే వారు ముందుగా వరంగల్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి 60 కిమీ దూరంలో పాకాల ఉంటుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు