తెలుగు న్యూస్ / ఫోటో /
OU Distance Admissions 2024 : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - నవంబర్ 15 వరకు దరఖాస్తుల గడువు పొడిగింపు
- Osmania University Distance Education 2024 : ఓయూ దూర విద్యలో తొలి విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువును నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమాతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరవచ్చు.
- Osmania University Distance Education 2024 : ఓయూ దూర విద్యలో తొలి విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువును నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమాతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరవచ్చు.
(1 / 7)
ఉస్మానియా వర్శిటీ దూర విద్యలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరాని(2024 -25)కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.అక్టోబర్ 15వ తేదీతో గడువు ముగియగా… తాజాగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
(2 / 7)
డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తుల గడువును నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
(3 / 7)
డిగ్రీలో చూస్తే బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు డిప్లోమా కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
(4 / 7)
డిగ్రీ మూడేళ్ల కాలపరితిమితో ఉంటుంది. పీజీ రెండేళ్లు, డిప్లోమా కోర్సులు ఏడాది కాలపరిమితితో ఉంటాయి. కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి. సెమిస్టర్ విధానంలో పరీక్షలు జరుగుతాయి.
(5 / 7)
ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక విధానాలు ఉంటాయి. డిగ్రీ అర్హత మాత్రమే కాకుండా… టీఎస్ ఐసెట్/ ఏపీఐసెట్ ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.వారు మాత్రమే ఇందులో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. http://www.oucde.net/ వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవాలి.
(6 / 7)
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మొదటగా http://www.oucde.net/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. Click Here Below Link For Online Admission' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ యూజీ, పీజీ, డిప్లోమా, ఎంబీఎం, ఎంసీఏ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.
ఇతర గ్యాలరీలు