Naveen Chandra: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ - ఉత్తమ నటుడిగా నవీన్ చంద్రకు పురస్కారం - ఏ సినిమాకు అంటే?
దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 లో ఉత్తమ నటుడిగా టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర పురస్కారాన్ని అందుకున్నారు. మంత్ ఆఫ్ మధు సినిమాకుగాను నవీన్ చంద్రకు ఈ అవార్డు దక్కింది
(1 / 5)
మంత్ ఆఫ్ మధు సినిమాలో మధుసూదన్‌రావు అనే తాగుబోతు పాత్రలో సహజ నటనను కనబరిచాడు నవీన్ చంద్ర. ఈ సినిమాలో నవీన్ చంద్ర అసమాన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
(2 / 5)
దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు పోటీపడ్డారు. వారందరిని కాదని మంత్ ఆఫ్ మధు సినిమాకుగాను నవీన్ చంద్రను ఈ ఉత్తమ నటుడి అవార్డు వరించింది.
(3 / 5)
మంత్ ఆఫ్ మధు సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించింది.
(4 / 5)
అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ చంద్ర. ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు