Telangana Tourism : వీకెండ్ లో సాగర్ ట్రిప్ - కృష్ణమ్మ అలలపై బోటింగ్ తో పాటు బుద్ధవనం చూడొచ్చు! వన్ డే టూర్ ప్యాకేజీ ఇదే-nagarjuna sagar and buddhavanam tour package from hyderabad operated by telangana tourism details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : వీకెండ్ లో సాగర్ ట్రిప్ - కృష్ణమ్మ అలలపై బోటింగ్ తో పాటు బుద్ధవనం చూడొచ్చు! వన్ డే టూర్ ప్యాకేజీ ఇదే

Telangana Tourism : వీకెండ్ లో సాగర్ ట్రిప్ - కృష్ణమ్మ అలలపై బోటింగ్ తో పాటు బుద్ధవనం చూడొచ్చు! వన్ డే టూర్ ప్యాకేజీ ఇదే

Published Oct 10, 2024 08:46 AM IST Maheshwaram Mahendra Chary
Published Oct 10, 2024 08:46 AM IST

  • వీకెండ్స్ లో నాగార్జున సాగర్ అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800 టికెట్ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. టూర్ షెడ్యూల్ తో పాటు మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి….

తక్కువ ధరలోనే నాగార్జున సాగర్ చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. సాగర్ ప్రాజెక్టుతో పాటు సమీపంలో ఉన్న అద్భుతమైన ప్రాంతాలను చూడొచ్చు. కేవలం వన్ డ్ లోనే ఈ ట్రిప్ ముగుస్తుంది.

(1 / 7)

(Image source @tstdcofficial)

హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని  ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో జర్నీ ఉంటుంది. అంతకంటే ముందుగానే టూరిస్టులు బుకింగ్ చేసుకోవాలి. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అక్టోబర్ 12, 13వ తేదీల్లో అందుబాటులో ఉంది. ఈ వీక్ మిస్ అయితే… నెక్స్ట్ వీక్ లో ప్లాన్ చేసుకోవచ్చు.

(2 / 7)

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే Nagarjuna sagar Tour ' పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. హైదరాబాద్ నుంచి బస్సులో(నాన్ ఏసీ కోచ్) వెళ్తారు.

(3 / 7)

హైదరాబాద్ - సాగర్ టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 800గా నిర్ణయించారు. ఇక చిన్న పిల్లలకు రూ. 640గా ఉంది.

(4 / 7)

ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఇదే బస్సు 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు. ఉదయం 11:40 గంట‌ల‌కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. త‌ర్వాత‌ లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ను సంద‌ర్శ‌ిస్తారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ అంతా కూడా నిండిపోయి ఉంది.

(5 / 7)

సాయంత్రం 5 గంట‌ల‌కు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ వన్ డే టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(6 / 7)

హైదరాబాద్ - సాగర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=23&journeyDate=2024-10-12&adults=2&childs=0 

(7 / 7)

ఇతర గ్యాలరీలు