Tirumala Venkateswara: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు…ముక్తిప్రదములు ఏడు, బ్రహ్మోత్సవాల్లో వీటిని సందర్శించండి..-must visit places on tirumala during brahmotsava timing ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Venkateswara: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు…ముక్తిప్రదములు ఏడు, బ్రహ్మోత్సవాల్లో వీటిని సందర్శించండి..

Tirumala Venkateswara: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు…ముక్తిప్రదములు ఏడు, బ్రహ్మోత్సవాల్లో వీటిని సందర్శించండి..

Oct 02, 2024, 11:20 AM IST Bolleddu Sarath Chandra
Oct 02, 2024, 11:20 AM , IST

  • Tirumala Brahmotsavam: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం ముఖ భాగాన్ని వేంకటాద్రి అని, మధ్య భాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి.ఈ గిరులు అనేక రకాల వృక్ష, జీవసంపదకు, జంతువులకు ఆలవాలంగా ఉంటాయి.

 ముక్తిప్రదములను  సర్వమానవ కోటికి ముక్తి సాధనం కూర్చేవిగా  ఈ తీర్థాలను పూజిస్తారు. ఇవి సర్వోత్కృష్టమైనవిగా పరిగణిస్తారు. ఇవి మొత్తం ఏడు ఉన్నాయి.  1.⁠ ⁠శ్రీస్వామి పుష్కరిణీ 2. కుమారధార 3. తుంబురు 4. రామకృష్ణ 5. ఆకాశగంగ 6. పాపవినాశనం 7. పాండవ తీర్థం. దీనికి గోగర్భమని నామంకూడా కలదు.

(1 / 9)

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం  ముఖ భాగాన్ని వేంకటాద్రి అని, మధ్య భాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి.

(2 / 9)

తిరుమలగిరులు అనేక రకాల  వృక్ష సంపదకు, జీవసంపదకు, జంతుకోటికి ఆలవాలంగా,  అనేక పుణ్యతీర్థాలు కలిగి జలసంపదకు కూడా నిలయంగా ఉంటుంది. 

(3 / 9)

తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు ఉంటాయని భక్తుల విశ్వాసం..”పుణ్యతీర్థ” మనగా శుభము కలుగజేయు జలమని భావం.అలాంటి పుణ్యతీర్థములు తిరుమల పర్వత శ్రేణుల్లో 66 కోట్లున్నవని బ్రహ్మపురాణం, స్కంధపురాణాలు వివరిస్తున్నాయి.  

(4 / 9)

ఈ తీర్థములను ధర్మరతి, జ్ఞాన, భక్తి వైరాగ్య, ముక్తిప్రద తీర్థములు నాలుగుగా విభజించడమైనది. వీనిలో ముఖ్యమైనవి ఈ విధంగా ఉన్నాయి.ధర్మరతిప్రద తీర్థములు.ఈ  తీర్థముల దగ్గర నివసించిన లేక స్నానమాచరించిన లేక సేవించిన ధర్మాసక్తి కలుగునని పురాణములు తెలుపుచున్నవి. వీటి సంఖ్య 1008 గా నిర్దేశించడమైనది.

(5 / 9)

జ్ఞానప్రద తీర్థములలో జలములను సేవిస్తే జ్ఞానయోగం ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఇవి 108 ఉంటాయి. 1.⁠ ⁠మను తీర్థము 2. ఇంద్ర 3. వసు 4. రద్ర(11) 5. ఆదిత్య (12) 27. ప్రజాపతి (9) 36. అశ్విని 37. శుక్ర 38. వరుణ్‌ 39. జాహ్నవి 40. కాపేయ 41. కాణ్వ 42. ఆగ్నేయ 43. నారద 44. సోమ 45. భార్గవ 46. ధర్మ 47. యజ్ఞ 48. పశు 49. గణేశ్వర 50. భౌమాశ్వ 51. పారిభద్ర 52. జగజాడ్యహర 53. విశ్వకల్లోల 54. యమ 55. బ్బారస్పత్య 56. కామహర్ష 57. అజామోద 58. జనేశ్వర 59. ఇష్టసిద్ధి 60. కర్మసిద్ధి 61. వట 62. జేదుంబర 63. కార్తికేయ 64. కుబ్జ 65. ప్రాచేతస (10) 75. గరుడ 76. శేష 77. వాసుకి 78. విష్ణువర్థన 79. కర్మకాండ 80. పుణ్యవృద్ధి 81. ఋణవిమోచన 82. పార్జన్య 83. మేఘ 84. సాంకర్షణ 85. వాసుదేవ 86. నారాయణ 87. దేవ 88. యక్ష 89. కాల 90. గోముఖ 91. ప్రాద్యుమ్న 92. అనిరుద్ధ 93. పిత్రు 94. ఆర్షేయ 95. వైశ్వదేవ 96. స్వధా 97. స్వాహా 98. అస్థి 99. ఆంజనేయ 100. శుద్ధోదక 101. అష్ట భైరవ (8) – మొత్తం 108 తీర్థములు. 

(6 / 9)

భక్తి వైరాగ్యప్రద తీర్థాలను - జ్ఞానపద తీర్థములకన్నా శ్రేష్టమైనవిగా పరిగణిస్తారు.  ఈ తీర్థములను సేవించిన పాపపరిహారము, సంసార వైరాగ్యము, దైవభక్తి ప్రాప్తించునని ప్రశస్తి. ఇవి మొత్తం 68 తీర్థములు అవి ఏవనగా  1.⁠ ⁠చక్ర 2. వజ్ర 3. విష్వక్సేన 4. పంచాయుధ 5. హాలాయుధ 6. నారసింహ 7. కాశ్యప 8. మాన్మధ 9. బ్రహ్మ 10. అగ్ని 11. గౌతమి 12. దైవ 13. దేవం 14. విశ్వామిత్ర 15. భార్గవ 16. అష్టవక్ర 17. దురారోహణ 18. భైరవ, (పిశాచవిమోచనము) 19. మేహ (ఉదరవ్యాధి నాశనం) 20. పాండవ 21. వాయు 22. అస్థి (పునరుజ్జీవన సాధనము) 23. మార్కండేయు (ఆయువృద్ధి) 24. జాబాలి 25. వాలభిల్య 26. జ్వరహర (సర్వజ్వరనాశనం) 27.విషహర (తక్షక విషవ్యాధి నివారకం) 28. లక్ష్మి 29. ఋషి 30. శతానంద 31. సుతీక్షక 32. వైభాండక 33. బిల్వ 34. విష్ణు 35. శర్వ 36. శారభ 37 బ్రహ్మ 38. ఇంద్ర 39. భారద్వాజ 40. ఆకాశగంగ 41 ప్రాచేతస 42. పాపవినాశన 43. సారస్వత 44. కుమారధార 45. గజ 46. ఋశ్యశృంగ 47. తుంబురు 48. థావతారం(10) 58. హలాయుధ 59. సప్తర్షి(7) 66. గజకోణ 67. విశ్వక్సేన 68. యుద్ధసరస్థీ (జయప్రదాయకం) మొత్తం 68 తీర్థములు.

(7 / 9)

ముక్తిప్రదములను  సర్వమానవకోటికి ముక్తి సాధనం కూర్చేవిగా  ఈ తీర్థాలను పూజిస్తారు. ఇవి సర్వోత్కృష్టమైనవిగా పరిగణిస్తారు. ఇవి మొత్తం ఏడు ఉన్నాయి.  1.⁠ ⁠శ్రీస్వామి పుష్కరిణీ 2. కుమారధార 3. తుంబురు 4. రామకృష్ణ 5. ఆకాశగంగ 6. పాపవినాశనం 7. పాండవ తీర్థం. దీనికి గోగర్భమని నామంకూడా కలదు.

(8 / 9)

 శ్రీవారి ఆలయానికి ఈశాన్యదిశలో ఉండే శ్రీస్వామి పుష్కరిణీ తీర్థము  సర్వోత్కృష్టమైనదిగా, తీర్థరాజంగా శ్లాఘించబడుతున్నది. సాధారణంగా శ్రీవారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో, రధసప్తమి తదితర సందర్భాల్లో ఈ తీర్థస్నానం శుభదాయకమని చెబుతున్నా, ధనుర్మాసంలో శుద్ధ ద్వాదశి దినమున సూర్యోదయమున ఆరుఘడియల కాలం సర్వోత్తమమైనదిగా పురాణ ప్రశస్తి పొందింది.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు