Winter Diet Plan। చలికాలంలో చురుకుగా ఉండాలంటే మీ ఆహారంలో ఇవి ఉండాలి!-must add these foods to your diet to stay healthy and active during winter season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Winter Diet Plan। చలికాలంలో చురుకుగా ఉండాలంటే మీ ఆహారంలో ఇవి ఉండాలి!

Winter Diet Plan। చలికాలంలో చురుకుగా ఉండాలంటే మీ ఆహారంలో ఇవి ఉండాలి!

Dec 28, 2022, 05:43 PM IST HT Telugu Desk
Dec 28, 2022, 02:34 PM , IST

  • Winter Diet: చలికాలంలో ఏ పని చేయాలనిపించదు. శరీరం అలసిపోయినట్లుగా, నీరసంగా అనిపిస్తుంటుంది. అయితే మీరు సరైన ఆహారం తీసుకుంటే చురుగ్గా, ఆరోగ్యంగా ఉండవచ్చు.

  శీతాకాలంలో పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా శరీరం తక్కువ మెలటోనిన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో శరీరం చాలా బలహీనంగా అనిపిస్తుంది. పని చేయాలనే కోరిక తలెత్తదు. అయితే, ఈ కాలంలో పోషకాల లోపాన్ని భర్తీ చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

(1 / 6)

  శీతాకాలంలో పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా శరీరం తక్కువ మెలటోనిన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో శరీరం చాలా బలహీనంగా అనిపిస్తుంది. పని చేయాలనే కోరిక తలెత్తదు. అయితే, ఈ కాలంలో పోషకాల లోపాన్ని భర్తీ చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.(Freepik)

 ఐరన్: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఐరన్ తప్పనిసరి. ఇది చర్మం, జుట్టు, కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తేనె, రెడ్ మీట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డ్రైఫ్రూట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  శీతాకాలపు ఆహారంలో ఇవి  తప్పకుండా ఉంచాలి

(2 / 6)

 ఐరన్: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఐరన్ తప్పనిసరి. ఇది చర్మం, జుట్టు, కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తేనె, రెడ్ మీట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డ్రైఫ్రూట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  శీతాకాలపు ఆహారంలో ఇవి  తప్పకుండా ఉంచాలి(Freepik)

 కాల్షియం: ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి కాల్షియం అవసరం. ఎముకలతో పాటు, గుండె, కండరాలు , నరాల సరైన పనితీరును కూడా ఈ మూలకం అవసరం. ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు, డ్రైఫ్రూట్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

(3 / 6)

 కాల్షియం: ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి కాల్షియం అవసరం. ఎముకలతో పాటు, గుండె, కండరాలు , నరాల సరైన పనితీరును కూడా ఈ మూలకం అవసరం. ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు, డ్రైఫ్రూట్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.(Freepik)

  జింక్: జింక్‌ పోషకం అనేక అవసరాలను తీరుస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శరీరంలోని ఇతర అవయవాలు పని చేయడానికి ఇది అవసరం. ఈ మూలకాం సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. గుడ్లు, మాంసం, సీఫుడ్, బీన్స్, గోధుమలలో జింక్ పుష్కలంగా ఉంటుంది.

(4 / 6)

  జింక్: జింక్‌ పోషకం అనేక అవసరాలను తీరుస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శరీరంలోని ఇతర అవయవాలు పని చేయడానికి ఇది అవసరం. ఈ మూలకాం సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. గుడ్లు, మాంసం, సీఫుడ్, బీన్స్, గోధుమలలో జింక్ పుష్కలంగా ఉంటుంది.(Freepik)

 ఫోలిక్ యాసిడ్: కణాల సరైన పెరుగుదలలో ఫోలిక్ యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ B9 ప్రతి స్త్రీ శరీరానికి అవసరం. గర్భిణీ స్త్రీలు ఈ పోషకాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. పాలకూర, బ్రోకలీ, ఆవాలు, నిమ్మకాయలు, అరటిపండ్లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.

(5 / 6)

 ఫోలిక్ యాసిడ్: కణాల సరైన పెరుగుదలలో ఫోలిక్ యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ B9 ప్రతి స్త్రీ శరీరానికి అవసరం. గర్భిణీ స్త్రీలు ఈ పోషకాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. పాలకూర, బ్రోకలీ, ఆవాలు, నిమ్మకాయలు, అరటిపండ్లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.(Freepik)

 విటమిన్ సి: శీతాకాలంలో ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్, దుంపలు, సిట్రస్ పండ్లు, ఆకు కూరలు, టొమాటోలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

(6 / 6)

 విటమిన్ సి: శీతాకాలంలో ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్, దుంపలు, సిట్రస్ పండ్లు, ఆకు కూరలు, టొమాటోలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.(Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు