(1 / 5)
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, రేషన్ షాపు ద్వారా సన్న బియ్యం సరఫరా గురించి కీలక ప్రకటన చేశారు.
(2 / 5)
తెలంగాణలో జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తామని.. ఈ కార్డులను త్వరలోనే జారీ చేస్తామని వివరించారు.
(3 / 5)
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మంత్రి పొంగులేటి కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరుపేదలనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.
(4 / 5)
గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో.. అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రతి రైతుకు 2 లక్షల రుణ మాఫీ తప్పనిసరిగా చేస్తామని భరోసా ఇచ్చారు.
(@mpponguleti)(5 / 5)
ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు.
(@mpponguleti)ఇతర గ్యాలరీలు