Cancer in Men : మగవారూ జాగ్రత్త... మీకు అధికంగా వచ్చే క్యాన్సర్లు ఇవే-men beware these are the most common cancers for you ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cancer In Men : మగవారూ జాగ్రత్త... మీకు అధికంగా వచ్చే క్యాన్సర్లు ఇవే

Cancer in Men : మగవారూ జాగ్రత్త... మీకు అధికంగా వచ్చే క్యాన్సర్లు ఇవే

Feb 14, 2024, 07:00 PM IST Haritha Chappa
Feb 14, 2024, 07:00 PM , IST

  • Cancer in Men : మగవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు త్వరగా వస్తాయి. ఆ క్యాన్సర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అధికంగా వచ్చినట్టే... మగవారిలో కూడా కొన్ని రకాల క్యాన్సర్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. 

(1 / 7)

ప్రోస్టేట్ క్యాన్సర్ - స్పెర్మ్‌ను రవాణా చేసే అవయవం ప్రోస్టేట్ గ్రంథి.  మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్ర విసర్జన ఎక్కువగా రావడం, మూత్రంలో రక్తం, వీర్యంలో రక్తం, ఎముకల నొప్పి, అంగస్తంభన లోపం... వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. 

(2 / 7)

ఊపిరితిత్తుల క్యాన్సర్ - నిరంతర దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, గొంతులో బిగుతుగా అనిపించడం, ఆకస్మికంగా బరువు తగ్గడం, ఎముకల నొప్పి, తలనొప్పి ఈ లక్షణాలన్నీ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం చేసే మగవారిలో ఇది అధికంగా వచ్చే అవకాశం ఉంది. 

(3 / 7)

కొలొరెక్టల్ క్యాన్సర్ - మీకు తరచుగా విరేచనాలు కావడం,  లేదా మలబద్ధకంగా ఉండడం, తరచూ పొత్తికడుపు అసౌకర్యంగా, నొప్పిగా అనిపంచడం, నోట్లో నొప్పి రావడం, పొట్ట నిండుగా అనిపించడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది పెద్దపేగు క్యాన్సర్ గా భావించాలి. దీని బారిన పడుతున్న మగవారి సంఖ్య అధికంగా ఉంది. 

(4 / 7)

మూత్రాశయ క్యాన్సర్ - ఇది అధికంగా ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. మీ మూత్రంలో రక్తం కనిపించడం, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి రావడం, వెన్నునొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మూత్రం రంగు మారినా కూడా జాగ్రత్త పడాలి. 

(5 / 7)

మెలనోమా క్యాన్సర్ - మెలనోమా క్యాన్సర్ అనేది చర్మ క్యాన్సర్. ఈ క్యాన్సర్ మెలనోసైట్స్‌లో మొదలవుతుంది. మెలనిన్ అనే వర్ణద్రవ్యం చర్మానికి రంగును ఇస్తుంది. సూర్యరశ్మి అధికంగా తగలడం వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. చేతులు, ముఖం, కాళ్ళపై ఈ క్యాన్సర్ వస్తుంది. పుట్టుమచ్చలో మార్పు వచ్చినా కూడా జాగ్రత్త పడాలి. చర్మ క్యాన్సర్ మరణానికి కారణం అవుతుంది. 

(6 / 7)

పైన చెప్పిన క్యాన్సర్లు అధికంగా మగవారిలోనే కనిపిస్తాయి. ఇక్కడ చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు