తెలుగు న్యూస్ / ఫోటో /
Political Biopic Movies: ఓటీటీలో చూడాల్సిన సౌత్ పొలిటికల్ బయోపిక్ మూవీస్ ఇవే - వీటీపై ఓ లుక్కేయండి!
పొలిటికల్ లీడర్స్ బయోపిక్‌లు ఎప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. దక్షిణాదిలో పాపులర్ అయిన కొందరి నాయకుల జీవితాలో వచ్చిన సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయంటే?
(1 / 5)
దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ మహి.వి రాఘవ్. యాత్రకు సీక్వెల్‌గా వచ్చిన యాత్ర 2లో రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్ బయోపిక్‌గా తెరకెక్కించాడు మహి వి రాఘవ్.
(2 / 5)
మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళం మూవీ వన్ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(3 / 5)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంతో రూపొందిన తలైవి మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. టైటిల్ రోల్‌లో కంగనా రనౌత్ నటించిన ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు.
(4 / 5)
తమిళనాడు దిగ్గజ నాయకులు ఎంజీఆర్, కురుణానిధి జీవితాలతో మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ (తెలుగులో ఇద్దరు) మూవీ ఆహాతో పాటు అమెజాన్, డిస్నీ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
(5 / 5)
టాలీవుడ్ దిగ్గజ నటుడు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంతో ఆయన తనయుడు బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకులు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యాయి. ఎన్టీఆర్ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఈ రెండు సినిమాల్లో చూపించారు బాలకృష్ణ. కమర్షియల్‌గా మాత్రం కథానాయకుడు, మహానాయకుడు ఫెయిలయ్యాయి.
ఇతర గ్యాలరీలు