తెలుగు న్యూస్ / ఫోటో /
Hair fall in Men: పురుషుల్లో తక్కువ వయసులోనే జట్టు రాలేందుకు ముఖ్యమైన కారణాలు ఇవే.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
- Hair fall in Men: ఇటీవలి కాలంలో పురుషుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. కొందరికి తక్కువ వయసులోనే వెంట్రుకలు రాలి బట్టు తలవచ్చేస్తోంది. జుట్టు రాలేందుకు ప్రధానమైన కారణాలు ఇవే..
- Hair fall in Men: ఇటీవలి కాలంలో పురుషుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. కొందరికి తక్కువ వయసులోనే వెంట్రుకలు రాలి బట్టు తలవచ్చేస్తోంది. జుట్టు రాలేందుకు ప్రధానమైన కారణాలు ఇవే..
(1 / 7)
జుట్టు రాలే సమస్యను చాలా మంది పురుషులు ఎదుర్కొంటున్నారు. వెంట్రుకలు ఎక్కువగా రాలడంపై ఆందోళన చెందుతుంటారు. కంగారు పడుతుంటారు. జుట్టు రాలేందుకు కొన్ని కారణాలు కీలకంగా ఉంటాయి. (freepik)
(2 / 7)
తినే ఆహారంలో పోషకాలు లేకపోతే జుట్టుపై ప్రభావం పడుతుంది. పోషకాలు ఆరోగ్యానికే కాదు వెంట్రుకలకు కూడా చాలా ముఖ్యం. సరైన పోషకాలు లేని ఫుడ్ తింటే జుట్టు రాలే అవకాశాలు ఉంటాయి. జింక్, ఐరన్, విటమిన్ ఏ లాంటి పోషకాలు ఉండే ఫుడ్స్ తినాలి. సమతులాహారం తీసుకోవాలి.
(3 / 7)
మానసిక ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలుతుంది. తీవ్రమైన ఒత్తిడి ఉంటే వెంట్రుకలపై దుష్ప్రభావం పడుతుంది. జుట్టు రాలేందుకు కారణం అవుతుంది. అందుకే ఒత్తిడి తగ్గేలా ధ్యానం, వ్యాయామం లాంటివి ప్రతీ రోజూ చేయాలి.
(5 / 7)
జుట్టుకు రసాయనాలు ఉన్న ప్రొడక్ట్స్ వాడడం వల్ల కూడా చేటు జరుగుతుంది. కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉన్న జెల్స్, కలర్, హెయిర్ వ్యాక్స్, షాంపూల వల్ల జుట్టు రాలే ప్రమాదం ఉంటుంది. అందుకే జుట్టుకు రసాయనాలు లేని లేకపోతే చాలా తక్కువగా ఉన్న షాంపూలు, కలర్ లాంటి ప్రొడక్ట్స్ వాడాలి. ప్రతీ రోజూ జుట్టును కొబ్బరినూనె, ఆముదం లాంటి సహజమైన నూనెలతో మసాజ్ చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
(6 / 7)
పర్యావరణ కాలుష్యం కూడా జుట్టుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాలుష్యం, దుమ్ము పడడం వల్ల జుట్టు బలహీన పడి రాలిపోయే రిస్క్ ఉంటుంది. అందుకే కాలుష్యం నుంచి వెట్రుకలను రక్షించే జాగ్రత్తలు తీసుకోవాలి.
(7 / 7)
జుట్టు రాలే సమస్య తగ్గాలంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రతీ రోజు తగినంత నీరు తప్పకుండా తాగాలి. నూనెతో మర్దన చేయాలి. కెమికల్స్ లేని ప్రొడక్టులను వెంట్రుకలకు వినియోగించాలి. కాలుష్యంతో జుట్టు ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి ఎక్కువ కాకుండా మెడిటేషన్ లాంటివి చేయాలి. ఈ జాగ్రత్తల ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటికీ జుట్టు విపరీతంగా రాలుతుంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి.
ఇతర గ్యాలరీలు