తెలుగు న్యూస్ / ఫోటో /
Lung cancer symptoms: స్మోకింగ్ అలవాటు లేకపోయినా.. లంగ్ కేన్సర్ ముప్పు..
- Lung cancer symptoms:పొగతాగకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదని చాలా మంది అనుకుంటారు. కానీ స్మోకింగ్ అలవాటు లేనివారికి కూడా ఈ ప్రాణాంతక వ్యాధి సోకే అవకాశం ఉంది.
- Lung cancer symptoms:పొగతాగకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదని చాలా మంది అనుకుంటారు. కానీ స్మోకింగ్ అలవాటు లేనివారికి కూడా ఈ ప్రాణాంతక వ్యాధి సోకే అవకాశం ఉంది.
(1 / 6)
ఊపిరితిత్తుల కేన్సర్ పొగతాగేవారికి మాత్రమే కాదు. పొగాకు అలవాటు లేని వారికి కూడా వస్తుంది. లంగ్ కేన్సర్ కు సంబంధించిన ముఖ్య లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి.
(2 / 6)
దీర్ఘకాలిక దగ్గు లంగ్ కేన్సర్ ముఖ్య లక్షణం. ఈ దగ్గు నిరంతర సమస్యగా ఉంటుంది. కొంత కాలం తగ్గినట్లు అనిపించినప్పటికీ.. మళ్లీ మళ్లీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
(3 / 6)
ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలలో శ్వాస ఆడకపోవడం కూడా ఒకటి. ఈ బాధితులు ఊపిరి పీల్చుకోలేకపోతుంటారు. వైద్యులు దీనిని డిస్ప్నియా అని పిలుస్తారు. శ్వాస ఆడక నరకయాతన అనుభవిస్తుంటారు.
(4 / 6)
ఛాతీ నొప్పి కూడా లంగ్ కేన్సర్ లక్షణాలలో ఒకటి. ఛాతి నొప్పి తరచుగా వస్తున్నా, లేదా నొప్పి తగ్గకపోయినా, వైద్యుడిని సంప్రదించాలి.
(5 / 6)
కేన్సర్ యొక్క ప్రధాన లక్షణం ఆకలిని కోల్పోవడం. బరువు కూడా రోజురోజుకు తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకండి.
ఇతర గ్యాలరీలు