మేషరాశిలోకి ప్రవేశించనున్న కుజుడు: ఈ రాశుల వారికి ధనప్రాప్తి సహా చాలా ప్రయోజనాలు!-lucky zodiac signs to get money profits and more benefits from june 1 due to mars transit to aries ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మేషరాశిలోకి ప్రవేశించనున్న కుజుడు: ఈ రాశుల వారికి ధనప్రాప్తి సహా చాలా ప్రయోజనాలు!

మేషరాశిలోకి ప్రవేశించనున్న కుజుడు: ఈ రాశుల వారికి ధనప్రాప్తి సహా చాలా ప్రయోజనాలు!

May 22, 2024, 03:08 PM IST Chatakonda Krishna Prakash
May 22, 2024, 03:08 PM , IST

Mars Transit: ప్రస్తుతం మీనరాశిలో ఉన్న కుజుడు.. జూన్ 1వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మూడు రాశుల వారికి చాలా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ రాశులేవో ఇక్కడ చూడండి. 

గ్రహాలకు అధిపతి అయిన కుజుడు త్వరలో మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్నిరాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగత విషయాల్లోనూ అదృష్టం వరిస్తుంది. ప్రస్తుతం మీనంలో ఉన్న కుజుడు (అంగారకుడు) జూన్ 1న మేషరాశిలోకి అడుగుపెడతాడు. 

(1 / 6)

జూన్ 1 నుంచి జూలై 12 వరకు అంటే 41 రోజుల పాటు మేషరాశిలో కుజుడు సంచరిస్తాడు. ఫలితంగా ఈ కాలంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఈ కాలంలో ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో ఇక్కడ చూడండి. 

(2 / 6)

జూన్ 1 నుంచి జూలై 12 వరకు అంటే 41 రోజుల పాటు మేషరాశిలో కుజుడు సంచరిస్తాడు. ఫలితంగా ఈ కాలంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఈ కాలంలో ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో ఇక్కడ చూడండి. 

మేషం: మేషరాశిలో కుజుడి సంచారం ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మేషరాశి వారికి ఈ కాలంలో మంచి పెట్టుబడులతో భారీగా లాభాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. మీ పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. 

(3 / 6)

ధనస్సు: మేషంలో అంగారకుడి సంచారం ధనస్సు రాశి వారికి కూడా కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరికి వివిధ వనరుల నుంచి ధనం దక్కే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పనుల కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించి రావాల్సి రావొచ్చు. కొందరికి విదేశీయానం కూడా ఉండొచ్చు. వీరికి అన్ని పనుల్లో భాగస్వామి మద్దతు తెలుపుతారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. 

(4 / 6)

ధనస్సు: మేషంలో అంగారకుడి సంచారం ధనస్సు రాశి వారికి కూడా కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరికి వివిధ వనరుల నుంచి ధనం దక్కే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పనుల కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించి రావాల్సి రావొచ్చు. కొందరికి విదేశీయానం కూడా ఉండొచ్చు. వీరికి అన్ని పనుల్లో భాగస్వామి మద్దతు తెలుపుతారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. (Freepik)

మీనం: కుజ సంచారం మీనరాశి వారికి కూడా అదృష్టంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో చేసే అన్ని పనుల్లోనూ విజయం సిద్ధిస్తుంది. ఆర్థికంగానూ మెరుగవుతారు. 

(5 / 6)

మీనం: కుజ సంచారం మీనరాశి వారికి కూడా అదృష్టంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో చేసే అన్ని పనుల్లోనూ విజయం సిద్ధిస్తుంది. ఆర్థికంగానూ మెరుగవుతారు. 

గమనిక: ఈ సమాచారం.. శాస్త్రం, నమ్మకాల మీద ఆధారపడినది. శాస్త్రీయ ఆధారాలు ఉండవు. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు అన్ని విషయాలను ధృవీకరించలేదు. 

(6 / 6)

గమనిక: ఈ సమాచారం.. శాస్త్రం, నమ్మకాల మీద ఆధారపడినది. శాస్త్రీయ ఆధారాలు ఉండవు. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు అన్ని విషయాలను ధృవీకరించలేదు. 

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు