సింహ రాశిలోకి సూర్యుడు: ఈ మూడు రాశుల వారికి కలిసిరానుంది.. ధనం, గౌరవంతో పాటు మరిన్ని ప్రయోజనాలు!
సూర్యుడు త్వరలో సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇందువల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. సింహ రాశిలో సూర్యుడు ఎంత కాలం ఉంటాడు.. ఏ రాశులకు లాభమో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాలకు రారాజైన సూర్యుడు నెలకు ఓసారి రాశిని మారతాడు. ప్రస్తుతం కర్కాక రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 16వ తేదీన సింహ రాశిలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు.
(2 / 5)
సింహ రాశిలో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు సూర్యుడు సంచరించనున్నాడు. ఈ నెల కాలంలో మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది. చాలా ప్రయోజాలు చేకూరే అవకాశం ఉంది.
(3 / 5)
సింహం: ఈ సంచారం వల్ల సింహ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి ధనం ఎక్కువగా చేకూరే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కారు, ఇల్లు కొనొచ్చు. వివాహం చేసుకోవాలని ప్రయత్నించే వారికి సత్ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
(4 / 5)
ధనస్సు: సింహ రాశిలో సూర్యుడి సంచారం.. ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగం చేసే వారికి ఈ కాలంలో పదోన్నతి దక్కే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగొచ్చు. విహారయాత్రకు వెళ్లొచ్చు. ఈ కాలంలో తీసుకునే చాలా నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. లాభాలు చేకూరుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా కలిసి వస్తుంది. డబ్బు విషయంలోనూ ప్రయోజనాలు చేకూరుతాయి.
(5 / 5)
వృషభ రాశి: ఈ కాలంలో వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. గౌరవం అధికమవుతుంది. కెరీర్ పరంగా లాభాలు దక్కుతాయి. ఈ కాలంలో వాహనం లేదా భూమి కొనుగోలు చేయొచ్చు. ఎక్కువగా ధనం పొదుపు చేస్తారు. సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ఫలితాలు, ప్రభావం గురించి తెలుసుకోవాలంటే సంబంధింత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు