నెలరోజుల పాటు ఈ రాశుల వారికి బాగా కలిసి రానుంది.. లాభాలు, సంతోషం!
- Lucky Zodiac Signs: ఈనెలలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. కన్యా రాశిలో బుధుడు, సూర్యుడి కలయికతో ఇది జరగనుంది. దీని వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి రానుంది. ఈ యోగం ఎప్పుడు ఉండనుంది.. ఏ రాశులకు లబ్ధి కలుగుతుందో ఇక్కడ చూడండి.
- Lucky Zodiac Signs: ఈనెలలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. కన్యా రాశిలో బుధుడు, సూర్యుడి కలయికతో ఇది జరగనుంది. దీని వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి రానుంది. ఈ యోగం ఎప్పుడు ఉండనుంది.. ఏ రాశులకు లబ్ధి కలుగుతుందో ఇక్కడ చూడండి.
(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం రాశులపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాల గమనం వల్ల కొన్ని యోగాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలో ఈనెల సెప్టెంబర్ నెలలో బుధాదిత్య రాజయోగం మొదలుకానుంది.
(2 / 5)
ఈ సెప్టెంబర్ 16వ తేదీన కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత కన్యా రాశిలోకే సెప్టెంబర్ 23న బుధుడు అడుగుపెడతాడు. దీనివల్ల కన్యారాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల సెప్టెంబర్ 23 నుంచి సుమారు నెల పాటు కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.
(3 / 5)
వృశ్చికం: ఈ బుధాదిత్య రాజయోగం కాలంలో వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరికి వ్యాపారంలో లాభాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పతాయి. పెట్టిన పెట్టుబడులపై రాబడి బాగానే ఉంటుంది. ఈ సమయంలో వీరికి సంతోషం కూడా ఎక్కువగా ఉంటుంది.
(4 / 5)
సింహం: ఈ యోగం కాలంలో సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి ఆదాయం ఎక్కువగా లభించే ఛాన్స్ ఉంటుంది. పెండింగ్‍లో ఉన్న డబ్బు చేతికి అందొచ్చు. (Pixabay)
(5 / 5)
మకరం: బుధాదిత్య యోగం వల్ల మకర రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. ఈ కాలంలో ఉద్యోగుస్తులకు జీతం పెరిగే ఛాన్స్ ఉంటుంది. వైవాహిక బంధం మరింత మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. సుదీర్ఘ ప్రయాణాలు చేయొచ్చు. వీరు ఈ కాలంలో ఎక్కువగా డబ్బు ఆదా చేస్తారు. (గమనిక; శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు