AP Cyclone Alert: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం..రెండ్రోజుల్లో తుఫానుగా రూపాంతరం.. ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..-low pressure in bay of bengal today turning into a storm in two days threat looming for uttarandhra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Cyclone Alert: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం..రెండ్రోజుల్లో తుఫానుగా రూపాంతరం.. ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..

AP Cyclone Alert: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం..రెండ్రోజుల్లో తుఫానుగా రూపాంతరం.. ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..

Oct 21, 2024, 06:18 AM IST Bolleddu Sarath Chandra
Oct 21, 2024, 06:18 AM , IST

  • AP Cyclone Alert: ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో  తూర్పుమధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండం గా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా  మారనుంది. దీని ప్రభావంఉత్తరాంధ్ర, ఒడిశా, బెంగాల్‌ పై ఎక్కువగా ఉండనుంది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 

(1 / 7)

బంగాళఖాతంలో సోమవారం ఏర్పడే అల్పపీడనం నేడు  పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను గా మారే అవకాశం ఉంది. 

(2 / 7)

బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం 23వ తేదీ నుంచి వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది.  దీని ప్రభావంతో అక్టోబర్ 24,25 ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

(3 / 7)

అక్టోబర్ 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతల్లో గంటకు 45-65కిమీ వేగంతో ఈదురు గాలులు సముద్రం అలజడిగా ఉంటుంది. అక్టోబర్ 24 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.  

(4 / 7)

ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 

(5 / 7)

ఈ ప్రభావంతో ఇవాళ(ఆదివారం) కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

(6 / 7)

అక్టోబర్ 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతల్లో గంటకు 45-65కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి సముద్రం అలజడిగా ఉంటుంది. అక్టోబర్ 24 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు