తెలుగు న్యూస్ / ఫోటో /
మహావిష్ణువుకు ఇష్టమైన రాశులు.. వీరిపై ఎల్లప్పుడూ ఆశీస్సులు, జీవితంలో సంతోషం!
favourite zodiac sign of lord vishnu : మహావిష్ణువు ఆశీస్సులు ఈ నాలుగు రాశుల వారిపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో ఇక్కడ చూడండి.
(1 / 6)
మహావిష్ణువు అనుగ్రహం వల్ల జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయి. గురువారం ఏకాదశి తిథి మహావిష్ణువు ఆరాధనకు ముఖ్యమైనదిగా భావిస్తారు. చాతుర్మాస్ అంటే స్వామివారు నాలుగు నెలల పాటు యోగంలో ఉండే సమయం.
(2 / 6)
ఏకాదశి అనేది శష రాజ యోగం, సర్వార్థ సిద్ధి యోగం కలయిక. ఇది చాలా అరుదైన యోగం. ఈ పర్వదినం సందర్భంగా విష్ణుమూర్తి చాతుర్మాస యోగ నిద్ర నుండి మేల్కొంటాడని చెబుతారు. క్రమం తప్పకుండా విష్ణుమూర్తిని ఆరాధించే వారికి నారాయణుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే కొన్ని రాశులపై శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉంటాయి. మహావిష్ణువుకు ఇష్టమైన, ప్రియమైన రాశులు ఏంటో తెలుసుకుందాం.
(3 / 6)
వృషభ రాశి : ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు ఎల్లప్పుడూ విష్ణువు అనుగ్రహం పొందుతారు. జీవితంలో అన్ని రకాల సంతోషాలను చూస్తారు.
(4 / 6)
కర్కాటక రాశి : ఈ రాశి మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రాశి. శ్రీ హరి ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సమాజంలో గౌరవం, విద్యను పొందారు.
(5 / 6)
సింహం : ఈ రాశికి అధిపతి సూర్యుడు. వైదిక జ్యోతిషశాస్త్రంలో విష్ణువును సూర్య నారాయణుని ప్రధాన దైవంగా వర్ణిస్తారు. సింహం విష్ణువుకు ఇష్టమైన రాశులలో ఒకటి. శ్రీ హరి అనుగ్రహంతో సింహ రాశి వారు తమ పనిలో విజయం సాధిస్తారు. వారి ప్రయత్నాలతో కొత్త శిఖరాలకు చేరుకుంటారు.
(6 / 6)
తులారాశి : ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమకు సంబంధించిన గ్రహం మాత్రమే కాదు ఆధ్యాత్మిక గ్రహం కూడా. ఇది విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి నివాసంగా కూడా భావిస్తారు. తులారాశిని లక్ష్మీదేవితో ఉన్న సంబంధం కారణంగా విష్ణువుకు అత్యంత ప్రియమైన రాశిగా భావిస్తారు. ఆనందం, గౌరవాన్ని పొందుతారు. (గమనిక : ఈ వ్యాసంలో ఇచ్చిన సమచారం కేవలం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీని కచ్చితత్వంపై హెచ్‌టీ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. సమాచారం ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశం.)
ఇతర గ్యాలరీలు