(1 / 6)
Messi Hat-Trick Goals: ఫిఫా వరల్డ్ కప్ ఢిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా క్వాలిఫయర్స్ లో చెలరేగిపోయింది. బొలివియాతో జరిగిన మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ మెస్సీ ఏకంగా మూడుగోల్స్ చేయడంతోపాటు రెండు గోల్స్ చేయడంతో సాయపడ్డాడు. దీంతో 6-0తో అర్జెంటీనా విజయం సాధించింది.
(AFP)(2 / 6)
Messi Hat-Trick Goals: 2026 ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ లో అర్జెంటీనా బొలీవియాతో తలపడింది. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్ లా ఆడింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో అర్జెంటీనా 6-0తో బొలీవియాను ఓడించింది.
(AFP)(3 / 6)
Messi Hat-Trick Goals: మ్యాచ్ 19వ నిమిషంలో మెస్సీ అర్జెంటీనా ఖాతా తెరిచాడు. 43వ నిమిషంలో మార్టినెజ్ గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. తొలి అర్ధభాగంలో అర్జెంటీనా తరఫున అల్వారెజ్ మూడో గోల్ చేశాడు.
(AFP)(4 / 6)
Messi Hat-Trick Goals: 69వ నిమిషంలో మథాయా అల్మాడా గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 4-0కు పెంచాడు. 84వ నిమిషంలో మెస్సీ రెండో గోల్ చేయడంతో అర్జెంటీనా 5-0 ఆధిక్యంలో నిలిచింది. అర్జెంటీనా తరఫున మెస్సీ 86వ నిమిషంలో ఆరో, చివరి గోల్ సాధించి హ్యాట్రిక్ సాధించాడు.
(AFP)(5 / 6)
Messi Hat-Trick Goals: మెస్సీ స్వయంగా మూడు గోల్స్ చేయడమే కాకుండా.. మార్టినెజ్, అల్వారెజ్ గోల్స్ చేయడంలో సాయం చేశాడు. ఆ లెక్కన మెస్సీ మ్యాచ్ మొత్తంలో 5 గోల్స్ చేసినట్లు అయింది.
(AFP)ఇతర గ్యాలరీలు