TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఆ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు, IMD తాజా అప్డేట్స్ ఇవే
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు మరోసారి ఐఎండీ చల్లనికబురు చెప్పింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు మరోసారి ఐఎండీ చల్లనికబురు చెప్పింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.(photo source from unsplash.com)
(2 / 7)
ఏప్రిల్ 25వ తేదీన ఏపీతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతంలో ఎండల తీవ్రత మరి ఎక్కువగా ఉంది.(photo source from unsplash.comphoto source from unsplash.com)
(3 / 7)
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు ఐఎండీ మరోసారి చల్లనికబురు చెప్పింది. ఇవాళ, రేపు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.(photo source from unsplash.com)
(4 / 7)
తెలంగాణతో పాటు దాని అనుకొని ఉన్న కోస్తాంధ్రప్రదేశ్ మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఉన్న ఉపరిత ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ఉత్తర కోస్తా, తమిళనాడు, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉందని వెల్లడించింది. (photo source from unsplash.com)
(5 / 7)
ఇవాళ , రేపు ఏపీలోని ఉత్తరకోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక తెలంగాణలో చూస్తే… ఏప్రిల్ 27వ తేదీ నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. (photo source from unsplash.com)
(6 / 7)
ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. (photo source from unsplash.com)
ఇతర గ్యాలరీలు