Heal Emotionally | తీవ్ర భావోద్వేగాల నుంచి ఊరట పొందాలంటే.. ఇవిగో మార్గాలు!
- ప్రతి చిన్న సమస్యకు అతిగా స్పందించి సమస్యలు కొనితెచ్చుకోవద్దు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే భావోద్వేగాల నియంత్రణ కీలకం. తీవ్ర భావోద్వేగాల ఒత్తిడి నుంచి ప్రతిరోజూ మానసిక ఉపశమనం పొందడానికి మనస్తత్వవేత్త డాక్టర్ నికోల్ లెపెరా కొన్ని చిట్కాలు అందిస్తున్నారు.
- ప్రతి చిన్న సమస్యకు అతిగా స్పందించి సమస్యలు కొనితెచ్చుకోవద్దు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే భావోద్వేగాల నియంత్రణ కీలకం. తీవ్ర భావోద్వేగాల ఒత్తిడి నుంచి ప్రతిరోజూ మానసిక ఉపశమనం పొందడానికి మనస్తత్వవేత్త డాక్టర్ నికోల్ లెపెరా కొన్ని చిట్కాలు అందిస్తున్నారు.
(1 / 6)
మనకు కలిగే భావోద్వేగాలు మన ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. భావోద్వేగాలు తీవ్రమైనపుడు వాటికి మనం ఎలా స్పందిస్తాం అనే దానిపైనే మన రోగనిరోధకశక్తి ఆధారపడి ఉంటుంది. నిరంతరమైన నెగెటివ్ ఆలోచనలు మనల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. ఇదిలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూపోతే చాలా ప్రమాదం. కాబట్టి మన శ్రేయస్సు గురించి మనం ఆలోచించాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. అందుకోసం మనం ప్రశాంతంగా ఉండే మార్గాలను అణ్వేషించాలి.(Pixabay)
(2 / 6)
ఎవరి ఒత్తిళ్లకు లొంగకూడదు, ఏదైనా వద్దూ అనుకుంటే వద్దు, లేదు అని స్పష్టంగా చెప్పేయాలి. మన పరిధులేంటో మనకు తెలిసి ఉండాలి. ఎలాంటప్పుడు వద్దు అని చెప్పాలి, ఎలా హద్దుల్లో ఉండాలో మీకుగా నిర్ణయించుకోండి. మీకోసం మీరే ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలు.(Pixabay)
(3 / 6)
Breathing exercies: ప్రాణయామం మిమ్మల్ని ఒత్తిడి నుంచి విముక్తి చేసి మీ మనసుకు ఒక లోతైనా విశ్రాంతిని కలుగజేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఒక 45 నిమిషాల నుంచి 2 గంటల పాటు ప్రాణాయామం లాంటి శ్వాస సంబంధమైన వ్యాయామాలు చేయండి. ఇది మీలోని శక్తిని తట్టిలేపుతుంది, మీలో పోరాడే స్పూర్థిని రగిలిస్తుంది.(Pixabay)
(4 / 6)
Learn something new: బుక్స్ చదవండి, లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవడం చేయండి. ఇలాంటి ఒక అలవాటు మీకు దీర్ఘకాలికమైన ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఏకాగ్రతను పెంచుతుంది. మీ రోజూవారీ ఒత్తిళ్లను నియంత్రింకునే శక్తిని కలిగిస్తుంది.(Pixabay)
(5 / 6)
Connect with someone you love: మీకు ఇష్టమైన వారితో కొద్దిసేపు మాట్లాడటం లేదా చాటింగ్ చేయడం లాంటిది చేయండి. ఒక మంచి సంభాషణ మీకు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది.(Pixabay)
ఇతర గ్యాలరీలు