Walking | ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.. ప్రతి రోజూ తప్పకుండా వాకింగ్ చేస్తారు!
- Walking.. నడక వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతూనే ఉంటారు. మొద్దుబారిపోయిన మెదడు మళ్లీ చురుగ్గా మారాలన్నా, శరీరం యాక్టివ్‌గా ఉండాలన్నా, ఎన్నో రకాల వ్యాధులు రాకూడదన్నా వాకింగ్ తప్పనిసరి. నడక మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుందని కూడా కొన్ని అధ్యయనాలు తేల్చాయి. వాకింగ్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
- Walking.. నడక వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతూనే ఉంటారు. మొద్దుబారిపోయిన మెదడు మళ్లీ చురుగ్గా మారాలన్నా, శరీరం యాక్టివ్‌గా ఉండాలన్నా, ఎన్నో రకాల వ్యాధులు రాకూడదన్నా వాకింగ్ తప్పనిసరి. నడక మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుందని కూడా కొన్ని అధ్యయనాలు తేల్చాయి. వాకింగ్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
(1 / 9)
పైసా ఖర్చు లేకుండా, ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేది నడకే. కేవలం 10 నిమిషాలు వేగంగా నడిస్తే చాలు మీ మెదడు చురుగ్గా మారుతుంది. గుండె పదిలంగా ఉంటుంది. కండరాలు బలోపేతమవుతాయి. ఉదయాన్నే లేదంటే మీకు వీలున్న సమయంలో వాకింగ్ చేయడమే మీరు చేయాల్సిన పని. ఉదయం చేస్తే ఎంతో ముఖ్యమైన సూర్యరశ్మి కూడా మీ ఒంటికి తగులుతుంది.
(Pixabay)(2 / 9)
వాకింగ్ వల్ల మెదడు చురుగ్గా మారడమే కాదు.. కొన్ని వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. నడక మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వాకింగ్ వల్ల కలిగే ఏడు ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
(Pixabay)(3 / 9)
మానసిక ఆరోగ్యానికి బూస్ట్: ఉదయాన్నే కొంతదూరం వాకింగ్ చేయడం వల్ల మీరు బరువు తగ్గుతారు. అంతేకాదు వాకింగ్ వల్ల మీ మెదడుకు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. దీనివల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది.
(Pixabay)(4 / 9)
సుఖనిద్ర: ఉదయాన్నే సూర్యరశ్మి ఒంటికి తగిలితే ఎంతో మంచిది. దీనివల్ల శరీరానికి డి విటమిన్ అందుతుంది. ఉదయం నడక మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది సుఖనిద్ర కోసం ఎంతో ముఖ్యమైన మెలటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(Pixabay)(5 / 9)
ఉత్సాహంగా ఉంటారు: ఒక్కసారి మీరు వాకింగ్ అలవాటుగా మార్చుకున్నారంటే ఇక నడవకుండా ఉండలేరు. ఎలాగైనా సరే కొంతదూరం నడవాలని అనిపిస్తుంది. దగ్గరల్లోని దుకాణానికి నడుచుకుంటూ వెళ్లడం, మీ కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లడం, మెట్లు ఎక్కడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతూ.. తీవ్రమైన అనారోగ్యాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
(Pixabay)(6 / 9)
బ్లడ్ గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది: షుగర్‌తో బాధపడుతున్న వారికి వాకింగ్ ఓ దివ్యౌషధం. ప్రతి రోజూ తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నడిస్తే రక్తంలో షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
(Pixabay)(7 / 9)
కండరాలకు బలం: వాకింగ్ వల్ల మీ కాళ్లు, పొట్ట భాగంలోని కండరాలు బలోపేతం అవుతాయి. ఆర్థిరిటిస్‌తో బాధపడేవాళ్లకు నడక ఎంతో మేలు చేస్తుంది.
(Pixabay)(8 / 9)
గుండెకు మంచిది: శారీరక శ్రమ వల్ల మీ గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది మీ గుండెను బలోపేతం చేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై శరీరంలో వివిధ భాగాలకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది.
(Pixabay)ఇతర గ్యాలరీలు