ఈ 6 ఆయుర్వేద మూలికలతో PCOS సమస్యను తగ్గించుకోవచ్చు-suffering from pcos try these herbs to manage symptoms ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ 6 ఆయుర్వేద మూలికలతో Pcos సమస్యను తగ్గించుకోవచ్చు

ఈ 6 ఆయుర్వేద మూలికలతో PCOS సమస్యను తగ్గించుకోవచ్చు

Feb 28, 2022, 08:35 PM IST HT Telugu Desk
Feb 28, 2022, 08:35 PM , IST

  • PCOS లేదా PCOD సమస్యలతో బాధపడుతున్నారా? ఈ ఆరు ఆయుర్వేద ఔషధాలను తీసుకొండి, మీకు తక్షణ ఫలితాలు లభిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. 

PCOS సమస్య ఉన్న మహిళల్లో పునరుత్పత్తి హార్మోన్ల విడుదల సక్రమంగా ఉండదు. ఈ అసమతుల్యత కారణంగా వారికి రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మొటిమలు రావడం మొదలగు ఇబ్బందులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది మహిళల్లో ఒకరు PCOS బారిన పడుతున్నారు. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా PCOS లక్షణాలను తగ్గించవచ్చు. అయితే కొన్ని ఆయుర్వేద మూలికలు ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతాయని ప్రముఖ పోషకాహార నిపుణులు కరిష్మా షా అంటున్నారు.

(1 / 8)

PCOS సమస్య ఉన్న మహిళల్లో పునరుత్పత్తి హార్మోన్ల విడుదల సక్రమంగా ఉండదు. ఈ అసమతుల్యత కారణంగా వారికి రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మొటిమలు రావడం మొదలగు ఇబ్బందులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది మహిళల్లో ఒకరు PCOS బారిన పడుతున్నారు. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా PCOS లక్షణాలను తగ్గించవచ్చు. అయితే కొన్ని ఆయుర్వేద మూలికలు ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతాయని ప్రముఖ పోషకాహార నిపుణులు కరిష్మా షా అంటున్నారు.(Pixabay)

మన వంటల్లో దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగిస్తాం. ఇన్సులిన్ వల్ల కలిగే సున్నితత్వంపై ఇది ప్రభావం చూపుతుంది. అంతేకాదు, పిసిఒఎస్ ఉన్న మహిళల్లో రుతుచక్రాన్ని క్రమబద్ధీకరించడంలో ఇది మంచి ఫలితాలను చూపుతుంది.

(2 / 8)

మన వంటల్లో దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగిస్తాం. ఇన్సులిన్ వల్ల కలిగే సున్నితత్వంపై ఇది ప్రభావం చూపుతుంది. అంతేకాదు, పిసిఒఎస్ ఉన్న మహిళల్లో రుతుచక్రాన్ని క్రమబద్ధీకరించడంలో ఇది మంచి ఫలితాలను చూపుతుంది.(Pixabay)

శరీరంలో ఒత్తిడి, ఆందోళన వలన ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ స్థాయిలను అశ్వగంధ సమతుల్యం చేస్తుంది. తద్వారా PCOS లక్షణాలను ఇది నియంత్రిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా అశ్వగంధ సహాయపడుతుంది. PCOS సమస్య ఉన్న మహిళల్లో ఈ మూలికను సేవించిన తర్వాత వేగవంతమైన మార్పులు గమనించినట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

(3 / 8)

శరీరంలో ఒత్తిడి, ఆందోళన వలన ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ స్థాయిలను అశ్వగంధ సమతుల్యం చేస్తుంది. తద్వారా PCOS లక్షణాలను ఇది నియంత్రిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా అశ్వగంధ సహాయపడుతుంది. PCOS సమస్య ఉన్న మహిళల్లో ఈ మూలికను సేవించిన తర్వాత వేగవంతమైన మార్పులు గమనించినట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

మకా రూట్ మరొక అద్భుతమైన మూలిక.  దీని చూర్ణం మహిళల్లో PCOS లక్షణాలను తగ్గించడమే కాకుండా శృంగార కోరికలు కలిగించడానికి, సంతానోత్పత్తిని పెంచడాని అద్భుతంగా పనిచేస్తున్నట్లు చాలా మందికి నిరూపితమైంది. దీనిని పురుషులు కూడా స్వీకరించవచ్చు. సంతానోత్పతికి సంబంధించి పురుషులకు సైతం ఇది మంచి ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది.

(4 / 8)

మకా రూట్ మరొక అద్భుతమైన మూలిక.  దీని చూర్ణం మహిళల్లో PCOS లక్షణాలను తగ్గించడమే కాకుండా శృంగార కోరికలు కలిగించడానికి, సంతానోత్పత్తిని పెంచడాని అద్భుతంగా పనిచేస్తున్నట్లు చాలా మందికి నిరూపితమైంది. దీనిని పురుషులు కూడా స్వీకరించవచ్చు. సంతానోత్పతికి సంబంధించి పురుషులకు సైతం ఇది మంచి ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది.(Instagram)

తులసిని హిందువులు పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. PCOS ఉన్న మహిళల్లో ఆండ్రోజెన్ స్థాయిలు, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో తులసి సహాయపడుతుంది. మహిళల్లో పురుష హార్మోన్ల అధిక ఉత్పత్తి కారణంగా PCOS ఉన్న స్త్రీలు మొటిమలు, అవాంఛిత రోమాలతో ఇబ్బందిపడుతారు. అలాంటి వారు తులసి ఆకులను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఈ హార్మోన్లను నియంత్రించి PCOS లక్షణాలు తగ్గించే ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. 

(5 / 8)

తులసిని హిందువులు పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. PCOS ఉన్న మహిళల్లో ఆండ్రోజెన్ స్థాయిలు, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో తులసి సహాయపడుతుంది. మహిళల్లో పురుష హార్మోన్ల అధిక ఉత్పత్తి కారణంగా PCOS ఉన్న స్త్రీలు మొటిమలు, అవాంఛిత రోమాలతో ఇబ్బందిపడుతారు. అలాంటి వారు తులసి ఆకులను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఈ హార్మోన్లను నియంత్రించి PCOS లక్షణాలు తగ్గించే ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. (Pixabay)

పసుపు ఔషధ గుణాల గురించి మనకు తెలియందేమి కాదు. అయితే ఇది PCOS సమస్యకు కూడా దారి చూపుతుందని మీకు తెలుసా? పసుపులో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతమైన పాలీఫెనాల్. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్య్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. PCOS చికిత్సలో డాక్టర్లు సూచించే క్లోమిఫెన్ సిట్రేట్ ఔషధంలాగా పసుపు కూడా ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా లభించే పచ్చిపసుపులో ఈ కర్కుమిన్ సమ్మేళనం పుష్కలంగా లభిస్తుంది.

(6 / 8)

పసుపు ఔషధ గుణాల గురించి మనకు తెలియందేమి కాదు. అయితే ఇది PCOS సమస్యకు కూడా దారి చూపుతుందని మీకు తెలుసా? పసుపులో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతమైన పాలీఫెనాల్. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్య్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. PCOS చికిత్సలో డాక్టర్లు సూచించే క్లోమిఫెన్ సిట్రేట్ ఔషధంలాగా పసుపు కూడా ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా లభించే పచ్చిపసుపులో ఈ కర్కుమిన్ సమ్మేళనం పుష్కలంగా లభిస్తుంది.(Pixabay)

Licorice: అతిమధురం ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగించే మూలిక. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు నరాల నొప్పి, పీరియడ్స్ వల్ల కలిగే తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కార్టిసాల్‌ను జీవక్రియ ద్వారా మరో రూపంలోకి మారుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో కలిగే నొప్పులు, మంటలను తగ్గించటానికి అతిమధురం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది అండాశయ తిత్తులను నివారిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

(7 / 8)

Licorice: అతిమధురం ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగించే మూలిక. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు నరాల నొప్పి, పీరియడ్స్ వల్ల కలిగే తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కార్టిసాల్‌ను జీవక్రియ ద్వారా మరో రూపంలోకి మారుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో కలిగే నొప్పులు, మంటలను తగ్గించటానికి అతిమధురం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది అండాశయ తిత్తులను నివారిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.(Pixabay)

Shatavari: శాతవారిలో ఫైటోఈస్ట్రోజెన్, ఇతర సహజ ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ మూలిక పిసిఒఎస్‌ సమస్యతో బాధపడే మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందు. ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి, ఇన్సులిన్ నిరోధకతపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

(8 / 8)

Shatavari: శాతవారిలో ఫైటోఈస్ట్రోజెన్, ఇతర సహజ ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ మూలిక పిసిఒఎస్‌ సమస్యతో బాధపడే మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందు. ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి, ఇన్సులిన్ నిరోధకతపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు