తెలుగు న్యూస్ / ఫోటో /
Friendship | దోస్తీ చెడిపోవడానికి ముఖ్య కారణాలివే!
- సాధారణంగా ఎవరైనా స్నేహితులతో సమయం గడిపేందుకు ఇష్టపడతారు. కానీ మీరు మీ మిత్రులను కలవకపోవడం, వారికి అసలు సమయం కేటాయించకపోవడం. వారి సాంగత్యంలో చిరాకుగా ఉండటం వంటివి చేస్తే మీ స్నేహం ఇక ముగింపుకు వచ్చినట్లే.
- సాధారణంగా ఎవరైనా స్నేహితులతో సమయం గడిపేందుకు ఇష్టపడతారు. కానీ మీరు మీ మిత్రులను కలవకపోవడం, వారికి అసలు సమయం కేటాయించకపోవడం. వారి సాంగత్యంలో చిరాకుగా ఉండటం వంటివి చేస్తే మీ స్నేహం ఇక ముగింపుకు వచ్చినట్లే.
(1 / 8)
అన్ని స్నేహాలు కడదాకా ఉండవు. కానీ కడదాకా మీకోసం.. మీ వెన్నంటే నిలిచే స్నేహాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే మనల్ని బంధువులు, అయినవాళ్లు అందరూ విడిచి వెళ్లినపుడు మన కోసం నిలబడేదే స్నేహం. ఏం లేనివాడు కాదు స్నేహితులు లేనివాడు నిజమైన పేదవాడు అంటారు. మరి మీ నుంచి స్నేహితులు ఎందుకు దూరం అవుతారో మానవ సంబంధాల నిపుణులు కొన్ని కారణాలను తెలియజేశారు.(Pixabay)
(2 / 8)
స్నేహితులకు సమయం కేటాయించకపోవడం. ప్రతీసారి వారి సాంగత్యాన్ని చిరాకుపడటం. ఏ విషయాన్ని పంచుకోకుండా రహస్యంగా ఉండటం లాంటివి స్నేహాన్ని విచ్ఛినం చేసే అంశాలు.(Pixabay)
(4 / 8)
మీ వ్యక్తిత్వంలో మార్పు రావడం.. మీ హోదాకు సరితూగే వ్యక్తులు మీ చుట్టూ ఉండాలని కోరుకోవడం. అభివృద్ధి చెందలేదని కొందరిని తక్కువగా చూసి దూరం చేసుకోవడం లాంటివి చేస్తే కేవలం వారు మాత్రమే కాకుండా మీ స్నేహాన్ని నిజమైన వ్యక్తులు ఎవరూ కోరుకోరు.(Unsplash)
(5 / 8)
మీ స్నేహితుల కాల్‌లు, వారి సందేశాలను విస్మరించడం.. వారికి ఎపుడూ కాంటాక్ట్ లో ఉండకపోవడం. కొన్ని విషయాల్లో చీటింగ్ చేయడం.(Unsplash)
(6 / 8)
మీకు సంబంధించిన ఎలాంటి శుభవార్తలు వారితో పంచుకోకపోవడం.. వేడుకలకు వారిని ఆహ్వానించకపోవడం.(Unsplash)
(7 / 8)
అందరు స్నేహితులు ఒకచోట కలిసినపుడు మీరు కలుపుగోలుగా ఉండకుండా మీరు వేరే అన్నట్లుగా ప్రవర్తించడం.(Unsplash)
ఇతర గ్యాలరీలు