Alia Bhatt Airport Looks | పెళ్లి తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆలియా..-new bride alia bhatt s airport looks in summer special pink floral suit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Alia Bhatt Airport Looks | పెళ్లి తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆలియా..

Alia Bhatt Airport Looks | పెళ్లి తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆలియా..

Apr 20, 2022, 01:13 PM IST HT Telugu Desk
Apr 20, 2022, 01:13 PM , IST

  • బాలీవుడ్​లో ఎయిర్​పోర్టులుక్స్​కు చాలా ప్రాధన్యత ఉంది. సెలబ్రెటీలు తమ ఎయిర్​పోర్ట్ లుక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇటీవల పెళ్లి చేసుకున్న నవవధువు ఆలియా కూడా షూటింగ్ నిమిత్తం ఎయిర్​పోర్టుకు వెళ్లింది. సాంప్రదాయ డ్రెస్​లో సమ్మర్​కు పర్​ఫెక్ట్​గా.. సింపుల్​లుక్​లో ఆలియా కనువిందు చేసింది. 

ఇటీవల రణ్​బీర్​ను పెళ్లి చేసుకున్న ఆలియా మళ్లీ షూటింగ్​లో పాల్గొనేేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ముంబైలోని కలీనా విమానాశ్రయానికి చేరుకుంది. ఫ్లైట్ కోసం వచ్చిన ఈ నవవధువు.. సమ్మర్ స్పెషల్​ లుక్​లో దేవకన్యలా మెరిసింది. 

(1 / 8)

ఇటీవల రణ్​బీర్​ను పెళ్లి చేసుకున్న ఆలియా మళ్లీ షూటింగ్​లో పాల్గొనేేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ముంబైలోని కలీనా విమానాశ్రయానికి చేరుకుంది. ఫ్లైట్ కోసం వచ్చిన ఈ నవవధువు.. సమ్మర్ స్పెషల్​ లుక్​లో దేవకన్యలా మెరిసింది. (Instagram/@aliabhatt_heartbeat)

కలీనా విమానాశ్రయం లోపలికి వెళ్తున్న ఆలియా భట్‌ను అక్కడున్న ఫోటోగ్రాఫర్​లు క్లిక్ చేశారు. ఫ్లైట్‌ కోసం లోపలికి వెళ్లేముందు.. ఆలియా కూడా ఫోటోలకు ఫోజులిచ్చింది. 

(2 / 8)

కలీనా విమానాశ్రయం లోపలికి వెళ్తున్న ఆలియా భట్‌ను అక్కడున్న ఫోటోగ్రాఫర్​లు క్లిక్ చేశారు. ఫ్లైట్‌ కోసం లోపలికి వెళ్లేముందు.. ఆలియా కూడా ఫోటోలకు ఫోజులిచ్చింది. (HT Photo/Varinder Chawla)

పెళ్లి తర్వాత మొదటిసారి ఆలియా ఎయిర్‌పోర్ట్​కు సాంప్రదాయ లుక్​లో వచ్చింది. ముదురు గులాబీ రంగులో వచ్చిన వసంత-ప్రేరేపిత ప్రింట్‌ కలిగిన పూల బ్లష్ పింక్ కుర్తాను ధరించింది. తెల్లటి లేస్‌తో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి స్లీవ్‌లు కుర్తాతో వచ్చాయి. సాంప్రదాయమైన సమ్మర్​ లుక్​లో ఆలియా పర్​ఫెక్ట్​గా ఉంది. 

(3 / 8)

పెళ్లి తర్వాత మొదటిసారి ఆలియా ఎయిర్‌పోర్ట్​కు సాంప్రదాయ లుక్​లో వచ్చింది. ముదురు గులాబీ రంగులో వచ్చిన వసంత-ప్రేరేపిత ప్రింట్‌ కలిగిన పూల బ్లష్ పింక్ కుర్తాను ధరించింది. తెల్లటి లేస్‌తో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి స్లీవ్‌లు కుర్తాతో వచ్చాయి. సాంప్రదాయమైన సమ్మర్​ లుక్​లో ఆలియా పర్​ఫెక్ట్​గా ఉంది. (HT Photo/Varinder Chawla)

ఆలియా ధరించిన కుర్తా బ్లష్ పింక్ ఫ్లేర్డ్ ప్యాంట్‌తో సిల్వర్ పట్టీ బార్డర్‌లతో వచ్చింది. తెల్లని లేస్ పట్టీ బార్డర్‌తో అలంకరించిన ఆర్గాన్జా దుపట్టాను వేసుకుంది. బ్లష్ పింక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ముదురు గులాబీ రంగులో మ్యాచింగ్ ఫ్లోరల్ ప్రింట్‌తో దానిని డిజైన్ చేశారు. 

(4 / 8)

ఆలియా ధరించిన కుర్తా బ్లష్ పింక్ ఫ్లేర్డ్ ప్యాంట్‌తో సిల్వర్ పట్టీ బార్డర్‌లతో వచ్చింది. తెల్లని లేస్ పట్టీ బార్డర్‌తో అలంకరించిన ఆర్గాన్జా దుపట్టాను వేసుకుంది. బ్లష్ పింక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ముదురు గులాబీ రంగులో మ్యాచింగ్ ఫ్లోరల్ ప్రింట్‌తో దానిని డిజైన్ చేశారు. (HT Photo/Varinder Chawla)

పూల అలంకారాలతో ఉన్న మోజారీ చెప్పులు, వజ్రాలతో పొదిగిన నిశ్చితార్థపు ఉంగరం, అందమైన జుమ్కీలతో ఆలియా చూడముచ్చటగా కనిపించింది. చేతిలో కలర్‌ఫుల్ ప్రింటెడ్ క్రిస్టియన్ డియోర్ టోట్ బ్యాగ్‌ని కూడా తీసుకువెళ్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. 

(5 / 8)

పూల అలంకారాలతో ఉన్న మోజారీ చెప్పులు, వజ్రాలతో పొదిగిన నిశ్చితార్థపు ఉంగరం, అందమైన జుమ్కీలతో ఆలియా చూడముచ్చటగా కనిపించింది. చేతిలో కలర్‌ఫుల్ ప్రింటెడ్ క్రిస్టియన్ డియోర్ టోట్ బ్యాగ్‌ని కూడా తీసుకువెళ్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (HT Photo/Varinder Chawla)

ఆలియా సైడ్ పాపిడతో తన జుట్టును సెట్​ చేసింది. న్యూడ్ పింక్ లిప్ షేడ్, బ్లష్డ్ బుగ్గలు, అందమైన బిందీ.. మినిమల్ మేకప్‌లో చాలా క్యూట్​గా కనిపించింది. మీరు కూడా వేసవిని సాంప్రదాయ లుక్​లో ముగించాలి అనుకుంటే.. ఆలియాను ఫాలో అయిపోండి.

(6 / 8)

ఆలియా సైడ్ పాపిడతో తన జుట్టును సెట్​ చేసింది. న్యూడ్ పింక్ లిప్ షేడ్, బ్లష్డ్ బుగ్గలు, అందమైన బిందీ.. మినిమల్ మేకప్‌లో చాలా క్యూట్​గా కనిపించింది. మీరు కూడా వేసవిని సాంప్రదాయ లుక్​లో ముగించాలి అనుకుంటే.. ఆలియాను ఫాలో అయిపోండి.(HT Photo/Varinder Chawla)

ఆలియా భట్, రణ్​బీర్ కపూర్ దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత.. ఏప్రిల్ 14వ తేదీన వివాహం చేసుకున్నారు. రణ్​బీర్​కు చెందిన పాలి హిల్ హౌస్ వాస్తులో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ పంజాబీ వేడుకలో ఒకటయ్యారు. 

(7 / 8)

ఆలియా భట్, రణ్​బీర్ కపూర్ దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత.. ఏప్రిల్ 14వ తేదీన వివాహం చేసుకున్నారు. రణ్​బీర్​కు చెందిన పాలి హిల్ హౌస్ వాస్తులో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ పంజాబీ వేడుకలో ఒకటయ్యారు. (HT Photo/Varinder Chawla)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు