తెలుగు న్యూస్ / ఫోటో /
Diabetes | ఇంట్లో వాడే సుగంధ దినుసులతోనే మధుమేహానికి చెక్.. అవేంటో చూడండి!
- డయాబెటిస్ సమస్య కలిగిన వారికి ఇన్సులిన్ తగినంత ఉత్పతి కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే ఇంటి వద్దనే లభించే వేప, అల్లం, మెంతులు, దాల్చిన చెక్క లాంటి కొన్ని పదార్థాలు సహజమైన ఔషధాలుగా పనిచేస్తాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
- డయాబెటిస్ సమస్య కలిగిన వారికి ఇన్సులిన్ తగినంత ఉత్పతి కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే ఇంటి వద్దనే లభించే వేప, అల్లం, మెంతులు, దాల్చిన చెక్క లాంటి కొన్ని పదార్థాలు సహజమైన ఔషధాలుగా పనిచేస్తాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
(1 / 6)
మందులు, ఆహారమే కాదు మన వంటింట్లో సాధారణంగా అందుబాటులో ఉండే కొన్ని సుగంధ దినుసులు కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అవేంటంటే..(Pixabay)
(2 / 6)
Ginger: ప్రతి కూరలో అల్లం వినియోగిస్తాం. ఈ అల్లం ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే వంటల్లో కంటే నేరుగా పచ్చి అల్లం తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఉంటాయని నిపుణులు అంటున్నారు.(Pixabay)
(3 / 6)
Cinnamon: మధుమేహం సమస్య ఉన్నవారు చక్కెరకు ప్రత్యామ్నాయంగా దాల్చిన చెక్క తీసుకోవచ్చు. ప్రతిరోజూ కొంత మోతాదులో దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల అది శరీరంలో ఇన్సులిన్ చర్యను ప్రేరేపిస్తుంది, తద్వారా మధుమేహం సమస్య అదుపులో ఉంటుంది.(Pixabay)
(4 / 6)
Fenugreek: మెంతులు లేదా మెంతికూర మధుమేహం నియంత్రణలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.(Pixabay)
(5 / 6)
Neem: వేపలోని అద్భుతమైన ఔషధ గుణాల గురించి మనకు తెలియంది కాదు. శరీరంలోని టాక్సిన్లను తొలగించడం, దంతాల రక్షణ, చర్మ సమస్యలు దూరం చేయడం ఇలా ఒకటేమిటి వేపతో కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఫ్లేవనాయిడ్‌లు, గ్లైకోసైడ్‌లు,ట్రైటెర్‌పెనాయిడ్లు కూడా వేపలో పుష్కలంగా ఉన్నాయట. డయాబెటిస్ ఉన్నవారు రోజుకు రెండుసార్లు ఖాళీ కడుపుతో వేప ఆకులు నమలడం, వేపాకు జ్యూస్ తాగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.(Shutterstock)
ఇతర గ్యాలరీలు