Janasena : జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు - కండువా కప్పిన పవన్
- వైసీపీని వీడిన ముగ్గురు కీలక నేతలు గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్యతో పాటు సామినేని ఉదయభానుకు పవన్ కల్యాణ్ కండువా కప్పారు. ఈ సందర్భంగా నేతల ముఖ్య అనుచరులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు.

(1 / 5)
ఇటీవలే వైసీపీని వీడిన ముగ్గురు కీలక నేతలు గురువారం జనసేన పార్టీలో చేరారు. వీరికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
(2 / 5)
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేనలో చేరారు. విజయనగరం జిల్లా నుంచి అవనపు విక్రమ్ దంపతులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు.
(3 / 5)
కొత్తగా వచ్చిన నేతలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. పాత, కొత్త అనే తేడా లేకుండా నేతలంతా కలిసి ఐక్యమత్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
(4 / 5)
నాయకులతో పాటు వారి వెంట వచ్చిన కార్యకర్తలతో మంగళగిరి వద్ద ఉన్న జనసేన కార్యాలయం వద్ద కోలాహలం కనిపించింది. వీరి చేరికల కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు.
ఇతర గ్యాలరీలు