TS Govt Gruha Jyoti Scheme Updates : 'ఉచిత కరెంట్' స్కీమ్ అప్డేట్ - రేషన్ కార్డు వాటితో లింకై ఉండాల్సిందే...!-latest updates regarding gruha jyoti free electricity scheme in telangana read this article ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Govt Gruha Jyoti Scheme Updates : 'ఉచిత కరెంట్' స్కీమ్ అప్డేట్ - రేషన్ కార్డు వాటితో లింకై ఉండాల్సిందే...!

TS Govt Gruha Jyoti Scheme Updates : 'ఉచిత కరెంట్' స్కీమ్ అప్డేట్ - రేషన్ కార్డు వాటితో లింకై ఉండాల్సిందే...!

Feb 08, 2024, 08:02 PM IST Maheshwaram Mahendra Chary
Feb 08, 2024, 08:02 PM , IST

  • Telangana Govt Free Electricity Scheme Updates : ఉచిత విద్యుత్ తో పాటు రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. అయితే ఫ్రీ కరెంట్ స్కీమ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…..

గృహజ్యోతి : ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది. 

(1 / 6)

గృహజ్యోతి : ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది. (unsplash.com)

గృహజ్యోతి స్కీమ్ కింద ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు ఇటీవలే తెలంగాణ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. రేపోమాపో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

(2 / 6)

గృహజ్యోతి స్కీమ్ కింద ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు ఇటీవలే తెలంగాణ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. రేపోమాపో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.(unsplash.com)

ఈ స్కీమ్ అమలుపై విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ స్కీమ్ అమలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంద్రవెల్లి సభలో ప్రకటించారు.

(3 / 6)

ఈ స్కీమ్ అమలుపై విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ స్కీమ్ అమలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంద్రవెల్లి సభలో ప్రకటించారు.(TSPSDCL)

ఇటీవల ‘ప్రజాపాలనలో ఫ్రీ కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులోని దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్‌కార్డులే లేవని తెలిసింది.

(4 / 6)

ఇటీవల ‘ప్రజాపాలనలో ఫ్రీ కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులోని దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్‌కార్డులే లేవని తెలిసింది.(unsplash.com)

రేషన్ కార్డులు లేని వారికి ఈ స్కీమ్ వర్తింపజేయటం కష్టమని తెలుస్తోంది. రేషన్‌కార్డు ఉండటంతో పాటు ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు ఫస్ట్ ఫేజ్ లో ఈ స్కీమ్ వర్తింపజేయాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

(5 / 6)

రేషన్ కార్డులు లేని వారికి ఈ స్కీమ్ వర్తింపజేయటం కష్టమని తెలుస్తోంది. రేషన్‌కార్డు ఉండటంతో పాటు ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు ఫస్ట్ ఫేజ్ లో ఈ స్కీమ్ వర్తింపజేయాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.(Photo From Minister Komatireddy Venkat Reddy Twitter)

అర్హులను గుర్తించేందుకు వీలుగా ఏ క్షణమైనా మార్గదర్శకాలను ఇచ్చేందుకు రెడీ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం.  అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఆ దిశగా విద్యుత్ శాఖ కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ లింకింగ్ వంటి వాటి అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మార్గదర్శకాలు వస్తే తెలుస్తుంది.

(6 / 6)

అర్హులను గుర్తించేందుకు వీలుగా ఏ క్షణమైనా మార్గదర్శకాలను ఇచ్చేందుకు రెడీ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం.  అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఆ దిశగా విద్యుత్ శాఖ కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ లింకింగ్ వంటి వాటి అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మార్గదర్శకాలు వస్తే తెలుస్తుంది.(unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు