Samsaptaka Yogam: ముఖాముఖిగా శని సూర్యుడి స్థానాలు, సంసప్తక యోగంతో ఈ రాశులకు ఇబ్బందులు తప్పవు
Surya Shani Samsaptaka Yogam: ఆగష్టు 16 నుండి సూర్య-శని ముఖాముఖిగా ఉంటారు. సూర్య-శని స్థానం కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది.రాబోయే నెలలో ఏ రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.
(1 / 5)
2024 ఆగస్టు 18 న, శని దేవుడు భాద్రపద నక్షత్రం రెండవ పాదం నుండి మొదటి పాదంలోకి ప్రవేశించాడు. శని నక్షత్ర రాశి మార్పు ప్రభావం మూడు రాశులలో ఎక్కువగా కనిపిస్తుంది. 16 ఆగస్టు 2024 గ్రహాల రాజు అయిన సూర్యుడు తన స్వీయ రాశి సింహ రాశిలోకి ప్రవేశించాడు.
(2 / 5)
సూర్యుడు 2024 సెప్టెంబర్ 16 వరకు ఈ రాశిలో ఉంటాడు. సూర్యుడు, శని ఎదురెదురుగా రావడం వలన సంసప్తక్ యోగం ఏర్పడుతుంది. శని-సూర్యుడి యొక్క ముఖాముఖి వల్ల కొన్ని రాశులకు అశుభం కలుగుతుంది. శని-సూర్యుడి కలయిక కొన్ని రాశులకు చాలా అశుభంగా ఉంటుంది. కొన్ని రాశులకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది .
(3 / 5)
కర్కాటక రాశి వారికి శని, సూర్యుల సంసప్తకం అశుభంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 16 వరకు ఉద్రిక్తంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాదనలకు దూరంగా ఉండాలి. లేకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. కానీ మనసు అశాంతిగా ఉంటుంది.
(4 / 5)
మేష రాశి : శని - మేష రాశి వారికి ఈ సంసప్తక యోగం వల్ల అశుభంగా ఉంటుంది. శని-సూర్య స్థానం మీ జీవితాన్ని చాలా అల్లకల్లోలంగా మారుస్తుంది. ఈ కాలంలో డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే డబ్బు నష్టపోవచ్చు. పెట్టుబడికి దూరంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. మనస్సులో ఒడిదుడుకులు ఉంటాయి. ఓపికగా ఉండండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.
(5 / 5)
కుంభరాశి : కుంభ రాశి వారికి శని, సూర్యుడి ముఖాముఖి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయం మీకు బాధాకరంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త పడాలి. లేకపోతే ఆర్థికంగా నష్టపోవచ్చు. స్వీయ నియంత్రణ పాటించాలి. అర్థం లేని కోపాలకు దూరంగా ఉండండి.
ఇతర గ్యాలరీలు