తెలుగు న్యూస్ / ఫోటో /
Curry leaves for hair: కరివేపాకును ఇలా వాడారంటే..ఎలాంటి జుట్టు సమస్య అయినా తగ్గిపోతుంది..
Curry leaves for hair: కరివేపాకును ఉపయోగించడం ద్వారా జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గించుకోవచ్చు. దానికోసం కరివేపాకును ఎలా వాడాలో తెల్సుకోండి.
(1 / 6)
చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. దుమ్ము, ధూళి, కాలుష్యం, ఐరన్ లోపం.. జుట్టు రాలడానికి కారణమవుతాయి. అంతేకాకుండా జెల్, స్ట్రెయిటర్ వంటి వివిధ రసాయనాల వల్ల కూడా జుట్టు చెడిపోతుంది. ఫలితంగా జుట్టు బలహీనంగా మారుతుంది. చుండ్రు సమస్యలు, తెల్ల జుట్టు, రఫ్ హెయిర్ వంటి సమస్యలు పెరుగుతూనే ఉంటాయి.
(2 / 6)
ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒక ఆకులో దాగుంది తెల్సా. అదే కరివేపాకు. ఈ కరివేపాకు అనేక జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. దీన్నెలా ఉపయోగించాలో తెల్సుకోండి.
(3 / 6)
కరివేపాకులోని ప్రోటీన్, బీటా కెరోటిన్ జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఈ ఆకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి జుట్టులో తేమను కాపాడుతాయి, చుండ్రు సమస్యను తొలగించడానికి సహాయపడతాయి.
(4 / 6)
హెయిర్ టానిక్ గా వాడండి: కరివేపాకును కొబ్బరినూనెలో వేసి ఆకులు బాగా నల్లగా మారే వరకు వేడిచేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా వడకట్టి కుదుళ్లలో బాగా మసాజ్ చేయాలి. ఒక గంట పాటు అలానే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ నూనెను వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. జుట్టు వేగంగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
(5 / 6)
హెయిర్ మాస్క్ గా ఉపయోగించండి: కొన్ని కరివేపాకులను తీసుకుని మిక్సీ పట్టండి. తర్వాత దీంట్లో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒక రోజు కరివేపాకు మాస్క్ అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది. పెరుగుకు బదులుగా ఉల్లిపాయ రసాన్ని కూడా ఈ హెయిర్ ప్యాక్ లో వేసుకోవచ్చు.
(6 / 6)
కరివేపాకు టీ: రెగ్యులర్ గా కరివేపాకు టీ తాగడం వల్ల కూడా వివిధ రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని కరివేపాకు ఆకులను నీటిలో ఐదు నిమిషాలు మరిగించి అందులో నిమ్మరసం, కొద్దిగా తేనె కలపాలి. ఈ టీని వారం రోజుల పాటు ట్రై చేయండి. ఈ టీ జీర్ణశక్తిని పెంచుతుంది. ఫలితంగా, జుట్టు ఆరోగ్యం బాగుంటుంది, జుట్టు తెల్లబడటాన్ని కూడా నివారించొచ్చు.
ఇతర గ్యాలరీలు