Khairtabad Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు-khairatabad ganesh darshan devotees flooded nimajjanam on sept 17th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Khairtabad Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

Khairtabad Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

Sep 15, 2024, 04:48 PM IST Bandaru Satyaprasad
Sep 15, 2024, 04:48 PM , IST

  • Khairtabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో బడా గణేష్ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. దర్శనానికి ఇవాళే చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో బడా గణేష్ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. 

(1 / 7)

వరుస సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు భక్తుల భారీగా తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ నుంచి పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయి కనిపిస్తున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

(2 / 7)

బడా గణేష్ దర్శనానికి ఇవాళే చివరి రోజు కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉందని నిర్వాహకులు అంటున్నారు. సోమవారం భక్తుల దర్శనాలను నిలిపివేసి,  నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తారు.  

(3 / 7)

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. మన గణేషుడు వరల్డ్ ఫేమస్ అన్నారు. 

(4 / 7)

ఖైరతాబాద్ గణేష్ సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. బడా గణేష్ దర్మనానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్, ఐమాక్స్, లక్డీకపూల్ మార్గాల్లో బడా గణనాథుడ్ని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు. 

(5 / 7)

బడా గణేష్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ నేతలు దర్శించుకున్నారు. క్యూలైన్ లో భక్తుల దర్శనానికి సుమారు 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. సాయంత్రానికి భక్తుల తాడికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

(6 / 7)

సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 6.30 గంటలకు పూజలు ముగించుకుని నిమజ్జనానికి గణనాథుడు బయలుదేరనున్నారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనాన్ని అన్ని ఏర్పాటు చేశారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు